అమరావతి లో అసైన్డ్ భూములు కొన్నవారికి బిగ్ షాక్

రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వారికి ల్యాండ్ పూలింగ్ కి విరుద్ధంగా సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వ హయంలో ల్యాండ్ పూలింగ్ చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు సేకరించారు. కాగా ఇక్కడే కొందరు ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు నిబంధనలను తుంగలోకి తొక్కి గతం లో పేదలకి, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను బలవంతంగా వారినుండి కొనుగోలు చేశారు. అనంతరం సీఆర్డీఏ ఈ భూములను భూ సమీకరణ కింద సేకరించి ఆ భూమికి బదులుగా వాణిజ్య ప్లాటాలను, నివాస స్థలాలని కేటాయించారు. గత ప్రభుత్వం మెట్ట ప్రాంతంలో ఎకరం భూమికి 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం, అదే జరీబు భూమి ఐతే ఎకరం భూమికి 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం కేటాయించింది
అయితే నిబంధనలు ప్రకారం అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (POT Act) 1977 ప్రకారం చట్ట విరుద్ధం. అలాంటి అసైన్డ్ భూములను ఎవరు కొనుగోలు చెయ్యడానికి వీలులేదా లీజుకి ఇవ్వడం చట్ట విరుద్ధం, ఆ భూములు మీద ఎలాంటి క్రయ విక్రయాలు జరగకూడదని ఆ చట్టం చాల స్పష్టంగా చెబుతుంది. దీనితో అసైన్డ్ భూములు సేకరించడం అందుకు ప్రతిగా వారికి సీఆర్డీఏ ప్లాట్ లను కేటాయించడం కూడా చట్ట విరుద్ధమే.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి అసైన్డ్ భూములకు కేటాయించిన ప్లాట్ లని రద్దు చేయాలని తీర్మానించింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్ లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.


Click Here and join us to get our latest updates through WhatsApp