నాతో వచ్చేదెవరు.. నాతో నడిచేదెవరు..

By Kotireddy Palukuri Dec. 13, 2019, 08:33 am IST
నాతో వచ్చేదెవరు.. నాతో నడిచేదెవరు..

సైకిల్ దిగి వైఎస్సార్ సిపి కండువా కప్పుకున్న నెల్లూరు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తన బలం, బలగం పై దృష్టి పెట్టారు. కావలి నియోజకవర్గం ఇప్పటి వరకు తనతో నడిచిన టిడిపి అనుచరులు, నేతలను ఇకపై కూడా తనతో నడిచేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. బలం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇంత కాలం తనతో నడిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ.. తనతో కలసి వచ్చే వారికి స్వాగతం చెబుతున్నారు. పైగా ఎవరి పైనా ఒత్తిడి చేయనంటూ సెంటిమెంటుతో కొడుతున్నారు. నిన్న గురురువారం కావాలి లోని దామవరం లోని తన ఫ్యాక్టరీ లో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన బీద తాను శుక్ర, శని వారాల్లో ఇక్కడే ఉంటానని, తనను కలిసేందుకు రావాలని కార్యకర్తలను కోరారు. ఆ మేరకు అనేక మంది తన అనుయాయులకు ఫోన్లు చేసి ఆహ్వానించారు.
Also Read : గుడ్ బై బాబు- బీదా

కావలి లో టిడిపి ఖాళీ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. బీద ఆహ్వానంతో టిడిపి కార్యకర్తలు, నేతలు అయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. దామవరం క్యూ కడుతున్నారు. తాను పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లాల్సిన పరిస్థితి గురించిబీద వారికి వివరిస్తున్నారు. బీసీలకు వైసీపీలో ప్రాధాన్యం ఇవ్వటం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనను ఆహ్వానించడంతో వైసీపీలోకి వెళ్లానని చెప్పినట్లు సమాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp