పందాలు జరుగుతాయా.? లేదా.? చేతులు మారేందుకు సిద్ధంగా ఉన్న కోట్ల రూపాయలు

By Amar S Jan. 14, 2020, 01:40 pm IST
పందాలు జరుగుతాయా.? లేదా.? చేతులు మారేందుకు సిద్ధంగా ఉన్న కోట్ల రూపాయలు

సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేవి గోదావరి జిల్లాలు.. అందులోనూ సంక్రాంతి కోడి పందాలు అంటే గుర్తుకువచ్చేది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. సంక్రాంతి పండుగ మూడురోజులు ఇక్కడ భారీఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. భారీ బరులు ఏర్పాటుచేసి పందాలు నిర్వహిస్తారు.

అయితే ఇప్పటికే కోడి పందాల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయి. అయినా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రతీ ఏట మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కోడి పందాలను ప్రారంభించారు. ఈ పందాలు సంక్రాంతి సాంప్రదాయంలో భాగమని, తాను పందాల బెట్టింగులకు వ్యతిరేకమని బెట్టింగుల పేరుతో కోడి పందాలను అడ్డుకోవద్దని పోలీసులను కోరారు. అలాగే గత కొన్నేళ్లుగా కోడి పందాలు నిర్వహించాలా వద్దా పెద్ద చర్చగా మారింది..

కత్తులు కట్టకుండా పందాలు వేసుకోవచ్చు అని పోలీసులు చెప్తుంటారు. అయినా పందెం రాయుళ్లు షరా మాములుగా పందాలు వేస్తుంటారు. ఏపీ ప్రజలు ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు సంక్రాంతి పండగ రోజు కోడిపందాలను సంప్రదాయంగా భావిస్తారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలనుండి కోడిపందెలు చూడడానికి భీమవరం వేలమంది వస్తారు. ఈ సంవత్సరం జగన్ సర్కార్ పందాల విషయంలో ఉక్కుపాదం మోపింది. కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేసారు.

ఇవాళ కనుమరోజున అక్కడక్కడ పందెం రాయుళ్లను పోలీసులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వేలాదిగా అనేక ప్రాంతాల నుండి కోడి పందాలు చూసేందుకు భీమవరం చేరుకుంటున్నారు. ఒకవైపు ప్రజలు ఆసక్తిగా పందాల కోసం ఎదురు చూస్తుండగా పోలీసులు పందెం రాయుళ్లను అడ్డుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే చేతులు మార్చేందుకు కొన్ని కోట్ల రూపాయలతో పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. ఏడాదిగా ఎదురు చూస్తున్న ఈ మూడురోజుల జూదంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎదురుచూస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp