సీఎం జగన్ ఫోటోకి బెస్ట్ ఎంట్రంట్ అవార్డ్

By Krishna Babu Aug. 06, 2020, 12:20 pm IST
సీఎం జగన్ ఫోటోకి బెస్ట్ ఎంట్రంట్ అవార్డ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎంత నిడారంబరంగా ఉంటారో ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపితం అయింది. ఓదార్పు యాత్ర నుండి పాదయాత్ర వరకు కూడా ప్రజలతో మమేకమై తన సింప్లిసిటితో ప్రజల మనసులు గెలుచుకున్నారు. అయితే తాజాగా జగన్ అనుకోకుండా తన నిరాడంబరతతో చేసిన ఒక పనిని అక్కడే ఉన్న ఒక ఫోటో గ్రాఫర్ ఫోటో తీయడంతో ఆ ఫోటోకి బెస్ట్ ఎంట్రంట్ అవార్డ్ లభించింది.

వివరాల్లోకి వెళితే గత సంవత్సరం విజయవాడలో జరిగిన  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, పోలీసులకు అవార్డుల్ని అందిస్తున్న క్రమంలో ఓ పోలీస్‌ అధికారికి ఆయన పతకం అలంకరించారు. అయితే ఆ పోలీస్  ముఖ్యమంత్రి జగన్ కు సెల్యూట్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన యూనిఫాంకు పెట్టిన పతకం జారి కింద పడిపోయింది. దాన్ని చూసిన సదరు పోలీస్ ఆఫీసర్ ముందుకు వెళ్లిపోగా.. సీఎం జగన్ వెంటనే... కిందకు వంగి ఆ పతకాన్ని స్వయంగా తీసి పక్కనే ఉన్న అధికారులకు అందించారు.

సీయంగా ఉంటూ పక్కనే సెక్యురిటీని ఉంచుకుని ఏమాత్రం బేషజం లేకుండా తానే వంగి ఆ పతకంని స్వయంగా తీయడంతో అందరు ఆయనలోని నిరాడంబరతకు ఆశ్చర్య పొయారు. ఈ సందర్భంలో వీరభగవాన్ అనే ఫోటో గ్రాఫర్ ఈ సన్నివేశాన్ని తన కెమెరాలో బంధించగా తాజాగా ఆ చిత్రానికి బెస్ట్ అవార్డ్ లభించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp