వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు

By Kiran.G Dec. 07, 2019, 04:34 pm IST
వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు

నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు.

Read Also: గుడ్ బై బాబు- బీదా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని మస్తాన్ రావు తెలిపారు. . అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎలక్షన్‌ మ్యానిఫెస్టోను వైఎస్సార్‌ సీపీ భగవద్గీత, బైబుల్‌, ఖురాన్‌గా భావిస్తోందని అన్నారు. వైసీపీ పార్టీలో ముఖ్యమంత్రి జగన్ విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని బీదా మస్తాన్ రావు వెల్లడించారు. 1983 లో రాజకీయాల్లోకి వచ్చానని ఎవరితోను విభేదాలు పెట్టుకోలేదని అయన వెల్లడించారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. శుక్రవారమే టీడీపీకి రాజీనామా చేసానని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp