భారత రత్న గురించి బాలకృష్ణ తీవ్ర అవమానకర వ్యాఖ్యలు ....

By Sanjeev Reddy Jul. 21, 2021, 06:30 pm IST
భారత రత్న గురించి బాలకృష్ణ తీవ్ర అవమానకర వ్యాఖ్యలు ....

ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ నేటిది కాదు . చంద్రబాబు ఓటర్ల దృష్టి తన వైపు తిప్పుకోవాలనుకొన్నప్పుడు ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారు , అలాగే ఎన్టీఆర్ ప్రతి జయంతికి కూడా టీడీపీ మహానాడులో ఇదే అంశాన్ని తీర్మానిస్తుంటారు . అయితే బాబు డిమాండ్ లో చిత్తశుద్ధి లేదు ,ఉండుంటే అతను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకొంటున్న రోజుల్లోనే నాటి అధికార బీజేపీ సహకారంతో భారత రత్న ఇప్పించి ఉండవచ్చు అని పలువురు పెద్దలు పెదవి విరుస్తుంటారు .

ఇక్కడ మరో కారణం కూడా లేకపోలేదు . ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డు ప్రకటిస్తే పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది మరో వివాదాస్పద అంశం . ప్రతిష్టాత్మక భారత రత్నతో పాటు ఏ అత్యున్నత పురస్కారం అయినా మరణించిన వ్యక్తికి ప్రకటించిన పక్షంలో ఆ వ్యక్తి భార్యకు ఆ అవార్డు అందజేస్తారు . భార్య లేని పక్షంలో సంతానానికి అందిస్తారు . ఆ ప్రకారం ఎన్టీఆర్ కి భారత రత్న మాత్రమే కాక ఏ అవార్డు ప్రకటించినా అది లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుంది . తన ఇంటి గ్యాలరీలోకి వెళ్తుంది తప్ప బాలకృష్ణకో , చంద్రబాబుకో చెందదు . ఈ అంశం వివాదాస్పదం కావొచ్చు . కోర్టుల వరకూ వెళ్లొచ్చు. ఎన్టీఆర్ కి అవార్డు రాకపోవటానికి ఇదీ ఒక కారణంగా అనుమానం వ్యక్తం చేస్తుంటారు పలువురు విశ్లేషకులు . ఈ కారణంతో ఎన్టీఆర్ కి అవార్డు రాకుండా బాబే అడ్డు పడ్డాడని లక్ష్మీపార్వతి గతంలో అనుమానం వ్యక్తం చేశారు .

Also Read:కుమారస్వామి ప్రభుత్వం కూలటానికి ‘‘పెగాస‌స్’’ కారణమా?

ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని టీడీపీ నిర్వహించిన మహానాడులో ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం తీర్మానించగా , ఎన్టీఆర్ ఘాట్ సందర్శించుకొన్న అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రికి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేయటంతో పాటు ఆయనకి అవార్డు ఇస్తే అది అవార్డుని , ఇచ్చిన వారిని వారే గౌరవించుకొన్నట్లు అని వ్యాఖ్యానించారు .

గత నెల పదవ తారీఖు ఓ టివి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతరత్న తన తండ్రి కాలిగోటితో సమానం అంటూ తీవ్ర వ్యాఖ్య చేసిన బాలకృష్ణ .నిన్న అదే టివి ఛానెల్ కు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో, భారత రత్న తన తండ్రి కాలి చెప్పుతోనూ , కాలి గోటితోనూ సమానమని చివరికి అన్నానని నోరుజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా మరి కొందరిపై కూడా నోరు పారేసుకొన్నాడు . రెహమాన్ లాంటి వాళ్ళని తాను పట్టించుకోనని పదేళ్ళకి ఓ హిట్ ఇస్తుంటాడు అతనికి ఆస్కార్ ఇచ్చారన్న బాలకృష్ణ నటన రాని శ్రీదేవి లాంటి పలువురు హీరోయిన్లకు తన తండ్రి కాళ్ళు తొక్కి ,నడుము మీద పీకి , వీపు మీద గుద్ది నటన నేర్పించాడని చెప్పుకొచ్చారు .
సాటి , సీనియర్ ఆర్టిస్టుల పట్ల బాలకృష్ణ దృక్పధం వారికిచ్చే గౌరవ మర్యాదల విషయం పక్కన పెడితే పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఉన్నత వ్యక్తులకు ఇస్తూ వస్తున్న అత్యున్నత పురస్కారమైన భారత రత్నని తన తండ్రి చెప్పుతోనూ కాలిగోటితోనూ బాలకృష్ణ పోల్చడం పట్ల అన్ని రంగాల ప్రముఖుల నుండి మాత్రమే కాక సామాన్య ప్రజల నుండి సైతం సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శల జడివాన కురుస్తుంది .

Also Read:అమరావతిలో జరిగినట్లు ఫైబర్‌ నెట్‌లోనూ జరగదని గ్యారెంటీ ఉందా..?

భారత రత్న పురస్కారం భారత పౌరులలో సంస్కృతి , సాహిత్యం , విజ్ఞాన , క్రీడా రంగాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన వారికి , రాజకీయ , సేవా రంగాల్లో కానీ మరేదైనా విధంగా కానీ దేశ అభ్యున్నతికి పాల్పడిన వారిని గుర్తించి భారత ప్రధాని ద్వారా భారత రత్న పురస్కారానికి సిఫారసు చేస్తూ రాష్ట్రపతికి నివేదిస్తారు . ఇందుకు స్త్రీ పురుష భేదం కానీ , ఉద్యోగ ,వ్యాపార , రాజకీయ స్థాయిలతో ప్రమేయం లేదు . విశిష్ట భారత రత్న పురస్కారం ఇరువురు విదేశీయులకు కూడా లభించింది . ఒకరు దేశ స్వాతంత్రం కోసం పాటు పడి దేశ విభజన తర్వాత పాకిస్తాన్ పౌరుడైన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కాగా మరొకరు దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా . ఇరువురూ శాంతి కోసం పాటుపడి నోబెల్ అవార్డు పొందిన వ్యక్తులు కావడం మరో విశేషం ..

శాంతియుత పోరాటాల విషయంలో మన జాతిపిత మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని అణిచివేతకు వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పోరాడి దక్షిణాఫ్రికా గాంధీగా పేరు పొందిన నోబెల్ అవార్డు గ్రహీత నల్లవజ్రం నెల్సన్ మండేలా కృషికి గుర్తింపుగా అతన్ని తమ వాడిగా భావించి భారత రత్న అవార్డుతో సత్కరించి విశాల హృదయం గల దేశంగా గౌరవం పొందింది భారత దేశం .

Also Read:మొదట తండ్రిని తరువాత కూతురిని వరించిన ఆ పదవి .

భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ నుండి సుప్రసిద్ధ గాయకుడు భూపేన్ హజరిక వరకూ విజ్ఞాన , రాజకీయ , సేవా , కళా రంగాల్లో దేశ ప్రతిష్ట ఇనుమడింపచేసిన నలభై ఎనిమిది మంది అత్యున్నత ప్రతిభావంతులుకు గౌరవ సూచకంగా సమర్పిస్తూ వస్తున్న భారత రత్న వంటి విశిష్ట పురస్కారాన్ని తన తండ్రి కాలి చెప్పుతోనూ , కాలి గోటితోనూ పోల్చడం బాలకృష్ణ దురహంకారం అని చెప్పొచ్చు .

దీని పట్ల భారత రత్న అవార్డు కమిటీ , భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp