యల"మంచి"లి పై వైసీపీ శ్రేణులకు ఎందుకంత కోపం ?

By Siva Racharla 15-11-2019 07:29 AM
యల"మంచి"లి పై వైసీపీ శ్రేణులకు ఎందుకంత కోపం ?

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని పెద్దల సామెత . అయితే యల"మంచి"లి అనే పేరులో ఉన్న మంచి నోటి మాటలో లేకపోవడమే నిన్న యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ కి తన పార్టీ మాజీ నేత వల్లభనేని వంశీ చేతిలో జరిగిన పరాభావానికి ఒక్కరు కూడా సానుభూతి తెలపకపోవడానికి కారణం అనుకోవచ్చు .

ఒక్కసారి గతంలోకి వెళ్లి చూస్తే 2018 అక్టోబర్ 25 నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై వైజాగ్ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరిగినప్పుడు మొదట లోకేష్ తో సహా అందరు ఆ దాడిని ఖండించారు.కానీ మీడియా చర్చలో బాబూ రాజేంద్రప్రసాద్ జగన్ మీద జరిగిన దాడిలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపించారు. ఆ చర్చలో జగన్ కు జరగరానిది ఏఁయినా జరిగితే ఆ సానుభూతితో అధికారం దక్కించుకోవచ్చన్న ఆలోచనతో వైఎస్ విజయమ్మ ,షర్మిళలే జగన్ మీద హత్యాయత్నం చేయించారని అత్యంత హేయమైన ఆరోపణ చేశాడు.హత్యాయత్నం జరిగినప్పుడు స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులు ఈ ఆరోపణ చేయగానే తమ స్టాండ్ కూడా మార్చుకొన్నాయి . సంఘటన జరిగిన వెంటనే సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసిన నారా లోకేష్ కూడా బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల తర్వాత అధికారం కోసం వైసీపీ వాళ్ళే చేయించుకున్న "కోడి కత్తి డ్రామా" అని ట్వీట్స్ చేయడం గమనార్హం .

ఇదే ఆరోపణ పై వైసీపీ మహిళా నేత రోజా స్పందిస్తూ అలా అయితే అలిపిరిలో బాబు పై జరిగిన హత్యాయత్నం అధికారం కోసం భువనేశ్వరి , లోకేష్ కలిసి చేయించారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని టీడీపీ శ్రేణులు టీడీపీ అనుకూల మీడియా,సోషల్ మీడియా వేదికగా మరింత దుష్ప్రచారం చేశాయి .ఇలాంటి చిల్లర ఆరోపణలు ఖండించి బాబూ రాజేంద్రప్రసాద్ను మందలించవలసిన చంద్రబాబు కూడా వీళ్లతో కలిసి కోడి కత్తి అని వెటకారంగా వ్యాఖ్యానించాడు. ఈ పరిణామాల తర్వాత వైసీపీ శ్రేణుల్లో యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మీద కోపం దాటి ద్వేషం ఏర్పడిందని చెప్పొచ్చు.బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో వచ్చిన కౌంటర్లు కూడా అన్నీఇన్నీ కావు. బహుశా చంద్ర బాబూ,లోకేష్ ల తర్వాత ఎక్కువ సెటైర్స్ వేయించుకొన్నది , తిట్టించుకొన్నది రాజేంద్రప్రసాదే. వైసీపీ కార్యకర్తలు తనపై చేసిన పోస్ట్స్ ,ట్వీట్స్ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయించి మరింత ద్వేషాన్ని మూటగట్టుకొన్నాడు యలమంచిలి .

రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా ద్వేషం పెట్టుకోకపోయినా కార్యకర్తలు మాత్రం మాటకి మాట బదులు కోసం ఎదురు చూస్తూనే ఉంటారు . నిన్న టీవీ 9 డిబేట్ లో టీడీపీ పార్టీకే చెందిన అసంతృప్త నేత వల్లభనేని వంశీ బాబూ రాజేంద్రప్రసాద్ తో మాట్లాడుతూ తన మీద పార్టీలో జరిగిన కుట్రలు గురించి చెప్పిన వైనం,రాజేంద్రప్రసాద్ ఘాటు వ్యాఖ్యలకు మరింత ఘాటైన పదజాలంతో నోరు మూపించటం చూసి రాజేంద్రప్రసాద్ కి తగిన శాస్తి జరిగింది అని సంతోషించని వైసీపీ కార్యకర్త లేడు అంటే అతిశయోక్తి కాదేమో.వంశీ వైసీపీ లోకి వెళ్ళటాన్ని వ్యతిరేకించిన వైసీపీ కార్ర్యకర్తలు కూడా నిన్నటి సంఘటన తరువాత వంశీ మావాడే అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చెయ్యటం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News