కారులో ఎమ్మెల్యే ఏదిరా ??? .

By KalaSagar Reddy Feb. 21, 2020, 09:39 am IST
కారులో ఎమ్మెల్యే ఏదిరా ??? .

విడుదల రజని లక్ష్యంగా దాడి ,
తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న భర్త , మరిది.
దాడికి పాల్పడింది ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ,
దాడి వెనుక టీడీపీ హస్తం ??

కోటప్పకొండ తిరుణాల్ల సందర్భంగా ఎమ్మెల్యే రజని స్వగ్రామంలో ఏర్పాటు చేసిన ఐదు విద్యుత్ ప్రభలను గత రాత్రి కోటప్పకొండకు తరలించారు . ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భర్త కుమార స్వామి , మరిది గోపి దగ్గరుండి పర్యవేక్షించి రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమవ్వగా కట్టుబడివారిపాలెం జుంక్షన్ చేరేసరికి అప్పటికే దారి కాచిన మూకలు ఒక్కసారిగా విడుదల రజని కారు మీదకి బండరాళ్లు విసిరి దాడికి తెగబడ్డారు .

దాడికి నాయకత్వం వహించిన వారు కారులో ఎమ్మెల్యే కోసం వెతుకుతూ "ఏదిరా ఎమ్మెల్యే , ఈ రోజు చంపేస్తాం దానిని" అంటూ దుర్భాషలాడుతూ కత్తులు , రాడ్లతో సైర్వవిహారం చేస్తూ వెతకడం చూస్తే ఎమ్మెల్యే పై హత్యా యత్నమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో దాడి చేసారనుకోవచ్చు . దాడి సమయంలో ఎమ్మెల్యే కారును అనుసరిస్తున్న వైసీపీ కార్యకర్తల సహకారంతో ఈ ఘటన నుండి స్వల్ప గాయాలతో ఎమ్మెల్యే భర్త , మరిది తప్పించుకోగా ఎమ్మెల్యే బంధువులు , వైసీపీ కార్యకర్తలు పది మంది వరకూ గాయపడ్డారని సమాచారం .

ఆది నుండీ ఒకే సామాజిక వర్గానికి పట్టున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ ఎమ్మెల్యేగా గెలవడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ పార్టీకి చెందిన వారే ఇటీవల ప్రభల విషయంలో ఏర్పడ్డ స్వల్ప వివాదాన్ని అడ్డం పెట్టుకొని హత్యాయత్నంకి పాల్పడ్డారని కధనాలు వినిపిస్తున్నాయి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp