తెలుగోడి ఆత్మగౌరవం సెంటిమెంట్ చంద్రబాబుకేనా? జగన్‌కి వర్తించదా?

By Ravoori.H Dec. 08, 2019, 08:26 am IST
తెలుగోడి ఆత్మగౌరవం సెంటిమెంట్ చంద్రబాబుకేనా? జగన్‌కి వర్తించదా?

తెలుగోడి ఆత్మగౌరవం అంటూ గొప్ప గొప్ప మాటలు మాట్లాడడంలో మనవాళ్ళు ఘనాపాఠీలు. కానీ ప్రస్తుత పరిస్థితులను రెండేళ్ళ క్రితం నాటి పరిస్థితులతో పోల్చి చూస్తూ ఉంటే మాత్రం ఈ తెలుగువాడి ఆత్మగౌరవం కూడా కేవలం ఒక పార్టీకి ఉపయోగపడడానికి ప్రచారం చేసుకున్న నినాదమేనా అని అనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీ స్థాపించిన సమయంలో ఎన్టీఆర్‌కి ఈ నినాదం గట్టిగానే ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పచ్చ మీడియా కూడా ఈ ఆత్మగౌరవనినాదాన్ని ఎన్నికల్లో టిడిపికి ఉపయోగపడేలా యధాశక్తి ప్రయత్నాలు చేశారు. గట్టిగానే లాభపడ్డారు కూడా. అయితే ఇప్పుడు ఇతర పార్టీల నాయకులను మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌ని అవమానించడానికి ఈ తెలుగుదేశం నాయకులు, ఆ పార్టీ భజన మీడియా చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ని కేవలం 2014ఎన్నికల్లో క్యాష్ చేసుకోవడానికి వాడుకున్నట్టుగా ఈ తెలుగోడి ఆత్మగౌరవం నినాదాన్ని కూడా పచ్చ బ్యాచ్ జనాలు వాడుకుంటున్నారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

సరిగ్గా రెండు సంవత్సరాల వెనుకకు వెళితే నాడు ఇదే మోడీ, అమిత్ షాలు చంద్రబాబును దూరం పెడుతూ ఉన్న సమయం. కారణాలు ఏమైనా చంద్రబాబుకు అపాయింట్‌మెంట్స్ ఇచ్చే విషయంలో, రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో మోడీ, అమిత్ షాలు దారుణంగా వ్యవహరించారు అన్నది నిజం. అయితే నాడు ఇదే పచ్చ మీడియా ఢిల్లీ పెద్దలు చంద్రబాబును అవమానిస్తున్నారు....తెలుగోడి ఆత్మగౌరవంపైన దెబ్బకొడుతున్నారు....బాబుకు మద్దతుగా ఉండి వాళ్ళను దెబ్బకొట్టాలి అని ఓ రేంజ్‌లో డప్పేసింది. ఇదేరకమైన ప్రచారంతో తెలంగాణా ఎన్నికల్లో కూడా గెలిచిపోవాలని చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా కూడా విశ్వప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మోడీ, అమిత్ షాలు చంద్రబాబును అవమానించారు....అంటే తెలుగోడి ఆత్మగౌరవంపైన దెబ్బకొట్టారు........కాబట్టి టిడిపికి ఓటు వేసి చంద్రబాబును గెలిపించండి అని చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు, నంబర్ ఒన్ పత్రికతో పాటు తోక పత్రికతో సహా టిడిపి భజన మీడియా సంస్థలన్నీ కూడా ఓ రేంజ్‌లో ప్రచారం చేశాయి.

కట్ చేస్తే కారణాలు ఏవైనా ప్రస్తుతం వైఎస్ జగన్ విషయంలో కూడా మోడీ, అమిత్ షాలు మద్దతుగా నిలబడే పరిస్థితులు కనిపించడం లేదు. రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో కూడా మోడీ, అమిత్ షాల వైఖరి చంద్రబాబు టైంలో ఎలా ఉందో ఇప్పుడు జగన్ పాలనాకాలంలో కూడా అలానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబుతో పాటు టిడిపి భజన మీడియా వాయిస్ మాత్రం పూర్తిగా మారిపోయింది. జగన్‌కి ఢిల్లీలో ఘోర అవమానం జరిగిపోతోంది అంటూ సంబరంగా వార్తలు వండి వారుస్తున్నారు. బాగా జరిగింది....ఇంకా ఇలానే జరగాలి అన్న ఉద్ధేశ్యాలతో కథలు, కథనాలు అల్లేస్తున్నారు. టిడిపి నాయకులతో పాటు పచ్చ మీడియా ఆనందం కూడా స్పష్టంగానే తెలిసిపోతూ ఉంది. జరిగిన ఐదు శాతం విషయాన్ని వంద శాతంగా నమ్మించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు.

ఇక్కడ చంద్రబాబు, జగన్‌లతో పాటు రాజకీయాలను కూడా పక్కన పెట్టి ఆలోచిద్దాం. తెలుగు వాళ్ళ కోసమే బ్రతికున్నాం, తెలుగోడి ఆత్మగౌరవం కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలు చేస్తాం అనే రేంజ్‌లో బిల్డప్పులు ఇచ్చే నాయకులు, తెలుగోద్ధరణ అంటూ రంకెలేస్తున్న పచ్చ మీడియా సంస్థలు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు అవమానం జరిగితే అది తెలుగోడి ఆత్మగౌరవంపైన దెబ్బ అయినప్పుడు, తెలుగువాళ్ళందరూ కూడా బాబుకు సపోర్ట్‌గా ఉండి టిడిపిని గెలిపించాల్సిన అవసరం ఉంది అని ప్రచారం చేసినప్పుడు...... ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్ విషయంలో కూడా అలానే ప్రచారం చేయాలి కదా? జగన్‌కి తెలుగు వాళ్ళందరూ మద్దతుగా నిలబడాలి అని చెప్పాలి కదా? ఎందుకు పూర్తి వ్యతిరేకంగా చెప్తున్నారు. అంటే తెలుగువాడి ఆత్మగౌరవం అని గావుకేకలు పెట్టేది కూడా కేవలం ఒక వర్గ నాయకుడు, పచ్చ మీడియాతో పాటు, పచ్చ బ్యాచ్ ఆర్థిక ప్రయోజనాలను కాపాడే పార్టీని గెలిపించమని చెప్పి ప్రజలను బకరాలను చేయడానికేనా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp