అశ్వత్ధామరెడ్డి నిరాహార దీక్ష ప్రారంభం

By Kiran.G 16-11-2019 11:35 AM
అశ్వత్ధామరెడ్డి నిరాహార దీక్ష ప్రారంభం

తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఊర్మిళా నగర్ లో తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. తనను అరెస్ట్ చేసినా పోలీస్ స్టేషన్ లో కూడా దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేసారు.కాగా ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు ప్రయతించినా పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం చర్చలకు పిలిచేవరకు దీక్ష కొనసాగుతుందని తెలిపార

గత 43 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. ఈ విషయమై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె పరిష్కరణకు నలుగురు సుప్రీంకోర్టు న్యాముర్తులతో కూడిన ప్రత్యేక కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించినా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. కాగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News