అసెంబ్లీ లో పంచులు...

By Bairisetty Nagaraju Dec. 10, 2019, 07:24 pm IST
అసెంబ్లీ లో  పంచులు...

ఈ చంద్రబాబు కు ఏమైంది...ఉదయం నుండి స్పీడుగా మాట్లాడుతున్నారు..చంద్రబాబు 25 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తూ ఉంటే, వాళ్ళాబ్బాయి మాత్రం 70 ఏళ్లు లాగా ఉన్నాడని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అసెంబ్లీలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అంబటి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. స్పందించిన అంబటి తమరు కూర్చుంటే మేము మాట్లాడుతానని చెప్పడం తో రామానాయుడు సైలెంట్ అయ్యారు.

ప్రతి పక్ష నాయకుడు చంద్ర బాబు ఈ రోజు తనకు బాగా నచ్చాడు అని, అబద్ధాలను కూడా చాలా గొప్పగా చెప్పే దిట్ట చంద్ర బాబు అని చురకలంటించారు. చంద్రబాబు కు 70 ఏళ్లు రావడం తో మతి మరుపు వచ్చిందని అన్నారు. మీకు పంప్లెట్ గా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి లో యాడ్ ఇస్తామంటే మీరేమో...సాక్షి...సాక్షి అని కలవరిస్తున్నారని అన్నారు.

టీడీపీ నాయకులు సభా సంప్రదాయాలు పాటించకుండా చంద్ర బాబు చుట్టూ చేరి సభ ను పాడు చేస్తున్నారని చురకలంటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ హాలు లో ఎమ్మెల్యేలు బల్లలపై అడ్డంగా పడి చంద్రబాబు తో మాట్లాడుతున్న పలు ఫోటోలను చూపిస్తూ అందర్నీ నవ్వించారు. పదేపదే జగన్ పై కేసులు ఉన్నాయని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కేసులు కోర్టులో ఉన్నాయని వాటి గురించి మాట్లాడటం సరి కాదన్నారు.

హెరిటేజ్ లో మీరు భాగస్వాములు అని నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్తారా అని అంబటి బాబుకి సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో మజ్జిగ, పెరుగు పేరుతో హెరిటేజ్ కు రూ.వందల కోట్లు దోచి పెట్టిన ఘనత బాబు కే దక్కిందన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీ లో టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు పదేపదే అసత్య మాటలు మాట్లాుతున్నారు అని అన్నారు. ఒకటికి పది సార్లు అబద్దం చెపితే అది నిజం అవుతుందని బాబు అనుకుంటున్నారని, ఎన్ని సార్లు చెప్పినా అబద్దం...అబద్దమే అన్నారు.మీరు చెప్పినట్లు బ్యాంక్ ల్లో ఉన్న రైతుల బంగారం విడిపించి ఉంటే ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయలేదని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు అన్నారు...ఉన్న జాబు లు ఊడ దీశారు తప్పితే...కొత్త జాబులు ఇవ్వలేదన్నారు. అసత్యాలు చెప్పిందుకే ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. అబద్ధాలు చెప్పే దిట్ట రాష్ట్రం లోనే కాదు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్ర బాబే అని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp