చిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు

By Kotireddy Palukuri 16-11-2019 11:29 AM
చిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు ఉద్యోగుల జీతాలు పెంచేలా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు విభాగాల్లోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచిన జగన్ సర్కార్ తాజాగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కేర్ ట్రస్ట్ ఉద్యోగుల జీతాలు పెంచింది. ట్రస్ట్ లో పని చేసే టీం లీడర్లు, ఆరోగ్య మిత్రల జీతాలను భారీగా పెంచింది. ప్రస్తుతం పీహెచ్ సి ఆస్పత్రుల్లో పని చేసే ఆరోగ్య మిత్రలకు 6,700 రూపాయలు, నెట్వర్క్ ఆస్పత్రుల్లో పని చేసే మిత్రలకు 8,600 చొప్పున జీతాలు ఇస్తుండగా.. ఇప్పుడు వారిరువురికీ 12 వేలకు పెంచారు. టీం లీడర్లకు 11 వేలు ఇస్తుండగా.. ఆ మొత్తం 15 వేలకు పెంచారు. పెంచిన జీతాలు వెంటనే అమలు చేయాలని ఆరోగ్యశ్రీ సీఈఓ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల 108, 104 ఉద్యోగుల జీతాలు కూడా భారీగా పెరిగిన విషయం తెలిసిందే.
idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News