ఆదాయాల కు కరోనా గండం

By Jaswanth.T Apr. 24, 2020, 08:43 am IST
ఆదాయాల కు కరోనా గండం

సామాన్య వ్యక్తి అయినా ఏ ప్రభుత్వమైనా ఆదాయం సమకూరే కాకపోతే ఇబ్బందులు పడక తప్పదు. వినాశకారి కరోనా తన ప్రభావం అన్ని రంగాలపైనా చూపించినట్లు ప్రభుత్వ ఆదాయం పైన కూడా పడింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు పేద ప్రజలను కాపాడేందుకు ఉచిత రేషన్ బియ్యం, కందిపప్పు, పంచదార వంటి సరుకులు పంపిణీ చేయడంతో పాటు నగదు కూడా అందించాయి. రావాల్సిన ఆదాయం రాకపోగా ఖర్చులు పెరగటంతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ తీరు చూసుకుంటే గత నెల కు గాను దాదాపు రావలసిన ఆరువేల కోట్ల రూపాయల ఆదాయం రాకపోగా.. సంక్షేమ పథకాల రూపములో 13 వేల కోట్ల రూపాయలు ఖర్చయినట్లు ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. ఈ లెక్కన రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసంఘటిత రంగం నష్టాలు కొంచెం అటు ఇటుగా తెలుస్తుండగా ఖచ్చితమైన ఆదాయం ఇచ్చే వివిధ ప్రభుత్వ శాఖల ఆదాయానికి మాత్రం భారీగా గండి పడుతోందని స్పష్టమవుతోంది.

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఇచ్చే ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖలో దాదాపు నెల రోజులు బోణి కూడా కొట్టని పరిస్థితులు నెలకొన్నాయి. భౌతిక దూరం నిబంధన కారణంగా వేలిముద్రలపై నిషేధం విధించడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాల నిలుచిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా తూర్పు గోదావరి నుంచి నెల లో దాదాపు 70 కోట్ల రూపాయల వరకు ఆదాయం కోల్పోయినట్లు అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో పోల్చి చూసినప్పుడు ఈ మేరకు ఆదాయం కోల్పోయినట్లుగా అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp