సినిమా కలెక్షన్ల పై రాజకీయ పార్టీల చింత ! తిరుపతి ఎన్నికల్లో ఇదే ప్రధానాంశమా?

By Voleti Divakar Apr. 12, 2021, 09:30 am IST
సినిమా కలెక్షన్ల పై రాజకీయ పార్టీల చింత ! తిరుపతి ఎన్నికల్లో ఇదే ప్రధానాంశమా?

ఎన్నికల్లో ప్రజలను ముఖ్యంగా పేద వర్గాలను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు అనేక ఫీట్లు వేస్తారు . దానిలో భాగంగా హోటళ్లల్లో పిండి రుబ్బుతారు ...... కాస్తారు ... రిక్షా లాగుతారు ... సైకిళ్లకు పంచర్లు వేస్తారు . అయితే వారంతా వందలాది రూపాయలు చెల్లించి వకీల్స్బనిఫిట్ పోలు చూడగరా ? . వారికి పవన్‌ కల్యాణ్ అంటే అభిమానం ఉన్నా గడిచే సంపాదనతో బెనిఫిట్ షోలు చూడలేరు . ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎవరికి మద్దతు చూడలేరు . ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎవరికి మద్దతు ప్రకటించాలి . న్యాయంగా అయితే సగటు ప్రేక్షకుడి వైపు నిలిచి , టిక్కెట్లు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలి .

థియేటర్ల వద్ద బిజెపి ఆందోళన అవసరమా ?

తిరుపతి లోకసభ ఉప ఎన్నికల నేపథ్యంలో బిజెపి , తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లు , ఆ సినిమా నిర్మాతల వైపు నిలిచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది . బిజెపి రాష్ట్ర సహ ఇన్ చార్జి సునీల్ ధియోధర్ , రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు , ఇతర బిజెపి నాయకులు తమ మిత్రపక్ష నేత పవన్ కోసం ధియేటర్ల వద్ద బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని , టిక్కెట్టు ధరలు పెంచుకునే అవకాశం కల్పించాలని ఆందోళన చేయడం విడ్డూరంగా ఉంది . తిరుపతి ఎన్నికల్లో ప్రజాసమస్యలు , సంక్షేమం కన్నా టిడిపి , బిజెపి నాయకులకు వకీల్ సాబ్ చిత్ర కలెక్షన్లపై చింత ఎక్కువగా కనిపిస్తోంది . గత అనుభవాల దృష్ట్యా ప్రజల్లో ఆదరణ లేదని తెలిసిపోవడంతో వకీల్ సాబ్ హీరో పవన్ కల్యాణ్ ప్రాపకం కోసమే బెనిఫిట్ షోల పై రాద్ధాంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది .

బాబుకెందుకు బాధ

తన మిత్రపక్ష నేత సినిమా కలెక్షన్ల కోసం బిజెపి నేతలు తమ స్థాయిని తగ్గించుకుని మరీ థియేటర్ల వద్ద ఆందోళన చేయడంలో ఒక అర్థం ఉంది . జన సేన దూరమైన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బెనిఫిట్ షోల విషయంలో ఎందుకు బాధపడుతున్నారో సామాన్య జనానికి అర్థం కావడం లేదు . తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు సూళ్లూరుపేటలో జరిగిన సభలో వకీల్ సాబ్ పై తన ఆవేదనను వెళ్లగక్కారు . గతంలో టిడిపి హయాంలో తన బావమరిది బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణికి రాయితీ ప్రకటించి , అనుష్క నటించిన రాణి రుద్రమదేవి చిత్రానికి అనుమతి ఇవ్వ లేదు .ఈ రెండు చిత్రాలు చారిత్రాత్మకమైనవే కావడం గమనార్హం . ఈ విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు . అయినా తనతో తెగతెంపులు చేసుకున్న పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్ల కోసం బాబు తాపత్రయం చూస్తుంటే మళ్లీ బిజెపి , , జనసేన కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఇదో వ్యూహమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .

బెనిఫిట్ షోతో ఎంతమందికి లాభం

బెనిఫిట్ షాలతో చిత్ర పంపిణీదారులు , ఎగ్జిబిటర్లు , నిర్మాతలకు తప్ప అభిమానులు , ప్రేక్షకులకు ఒరిగేదేమీ లేదని సినీ పండితులు చెబుతున్నారు . తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 17.7 లక్షల మంది ఓటర్లలో ఎంతమంది తొలిరోజున వకీల్‌ చిత్రాన్ని చూస్తారు . ఈ సంఖ్య లక్షకు మించి ఉండకపోచ్చు . వారి కోసం ఈ పోరాటమా. మిగిలిన సగటు ప్రేక్షకుడికి ఈ విధానం వల్ల జేబుకు చిల్లు తప్ప ఏమీ ఉండదు . నిజంగా బెనిఫిట్‌ షోకు అనుమతినిస్తే ఆ లక్ష మంది బిజెపికి ఓట్లు వేస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉంటుందా . విమర్శలను దృష్టిలో పెట్టుకుని అనుమతి ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు , సామాన్యప్రేక్షకులు ఆర్థికంగా నష్టపోతారు . తిరుపతి పరిధిలో ఎన్నో సమస్యలు ఉండగా రాజకీయ పార్టీలు వకీల్ సాబ్ కోసం తాపత్రయపడటం ప్రజలకు విస్మయాన్ని , అదే సమయంలో ఆయా పార్టీల పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది . 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp