ఇది వెన్నుపోటు ఫలితం బాబూ...!

By Chari.Ch Jan. 18, 2021, 05:50 pm IST
ఇది వెన్నుపోటు ఫలితం బాబూ...!

నాడు పార్టీ నుంచి బహిష్కరించి ఎన్టీఆర్
నేడు పార్టీనే బహిష్కరించిన ప్రజలు

25 సంవత్సరాల క్రితం..అంటే 1995, ఆగ‌స్టు 25 తేదీ.. తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఓ దుర్దినం.. ఆంధ్రుల అభిమాన అన్నగారు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఎన్టీఆర్ అనే నందమూరి తారక రామునికి వెన్నుపోటు పొడిచిన రోజు.. ఫ్యూడల్ స్వభావం ఉన్న వైస్రాయ్.. పేరు మీద నిర్మించిన హోటల్ వైస్రాయ్ వేదికగా అన్నగారికి ఘోర పరాభవం జరిగిన రోజు. అంతేకాదు.. పార్టీలో ఉంటూ..నమ్మకం నటిస్తూ.. పార్టీ నాయకత్వానికి వెన్నుపోటు పొడిచి పార్టీని హైజాక్ చేసిన నాటి మంత్రి, నేటి మాజీ ముఖ్యమంత్రి , నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఐదురు వెన్నుపోటు దారులుగా గుర్తించి ఎన్టీఆర్ పార్టీ నుంచి బహిష్కరించిన రోజు. ఆమేరకు అప్పటి అసెంబ్లీ స్పీకర్ కు టీడీఎల్పీ లీడర్ గా రామారావు లేఖ రాసిన రోజు.. చరిత్రలో దుర్దినంగా గుర్తుండి పోయే రోజు..

అంతేకాదు గత ఏడాది ఆగస్టు 25న.. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా 25 ఏళ్ల కిందట ఇదే రోజున టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తనను వెన్నుపోటు పొడిచినందుకు చంద్రబాబును పార్టీ నుంచి తొలగించారని, ఈ రోజును చంద్రబాబు గుర్తుచేసుకుంటారనే భావిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఇటీవల బీజేపీ పైనా, ప్రధాని మోదీ పైనా అపవాదులు వేశారని సునీల్ దేవధర్ ఆరోపించారు. ఇప్పుడు అధికారం కోల్పోయాడని, త్వరలోనే రాజకీయ బరి నుంచి కూడా నిష్క్రమిస్తారని జోస్యం చెప్పారు. ద్రోహులు ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందేనని ట్వీట్ చేశారు. అంతేకాదు, 1995 ఆగస్టు 25న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సహా ఐదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుపుతూ నాటి అసెంబ్లీ స్పీకర్ కు పంపిన లేఖను కూడా సునీల్ దేవధర్ పంచుకున్నారు. మరోవైపు చంద్రబాబుతో సహా ఆరోజు పార్టీనుంచి బహిష్కరించిన వారిలో పీ.అశోక్ గజపతి రాజు, కే. విద్యాధరరావు, టీ.దేవేందర్ గౌడ్, ఏ.మాధవ రెడ్డిలు ఉన్నారు. వీరిని బహిష్కరించిన రామారావు ఈ లోకంలో లేకున్నా..వారిని బహిష్కరిస్తూ రామారావు రాసిన లేఖను మాత్రం ఉంది. స్పీకర్ కు రాసిన ఆ లేఖ మాత్రం రికార్డెడ్ గా ఉండిపోయింది. అంటే కర్మఫలం అనుభవించక తప్పదని గూర్తు చేస్తూ!

వివరాల్లోకి వెళితే.. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగిందన్న సాకుతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ సాక్షిగా రామారావుపై చెప్పువు వేయించారు. ఆసమయంలో అప్పటి హోం మంత్రి ఇంద్రారెడ్డి రామారావు పక్కనే ఉన్నా.. పోలీసు బాస్ అప్పారావు మాత్రం.. హోం మంత్రి మాటలకన్నా.. చంద్రబాబు శిభిరానికే విలువిచ్చారు..రాజకీయంగా వైస్రాయ్ నాటకాన్ని రక్తి కట్టించడం ద్వారా .. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారంనుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించినా ఎన్టీఆర్ అభిమానుల గుండెళ్లో ఆరని చిచ్చులా రగులుతూనే ఉంది. అంతేకాదు అప్పట్లో చంద్రబాబు రాజకీయ చట్రంలో చిక్కుకున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ తర్వాత తప్పు తె లుకున్నారు. అందుకు నిదర్శనమే ఇటీవల ఓ ప్రైవేటు ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బీజేపీ నేత పురంధేశ్వరి మాట్లాడుతూ..ఒంటరి జీవితంలో తోడు కావాలని కోరుకున్న ఎన్టీఆర్, నాడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమేనని తెలిపారు. కానీ ఎన్టీఆర్‌ను చివరి దశలో ఆయన పిల్లలెవ్వరూ పట్టించుకోలేదనే విషయంలో నిజం లేదన్నారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా నేడు నడవట్లేదని విమర్శించారు. కానీ అప్పుడు చంద్రబాబు చెప్పిని సాకు లక్ష్మీ పార్వతి..అప్పుడు తప్పుపట్టి ఇప్పుడు ఒప్పు అన్నా ప్రయోజనం ఏముంది? జరాగాల్సిన ఘోరం జరిగిపోయాక.

నాడు ఎన్టీఆర్..నేడు ప్రజలు

వెన్నుపోటు పొడిచినందుకు 1995, ఆగ‌స్టు 25 తేదీన అప్పటి పార్టీ అధినేత ఎన్టీఆర్, చంద్రబాబును పార్టీ నుంచి బహిష్కరించారు.. అయితే రాజకీయ జిత్తులతో రామారావను వంచించి, పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకున్నారు చంద్రబాబు. అలాగని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా.. నమ్మి చేరదీస్తే వంచించి మోసం చేసిన పాపం ఊరికే పోతుందా? ఊ అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు...ఆయన అనుభవమంత వయస్సున్న జగన్ చేతిలో ఘోర పరాభం పాలయ్యారు. నాడు వెన్నుపోటు వైఖరి కారణంగా ఎన్టీఆర్ పార్టీనుంచి బహష్కరిస్తే.. నేడు బాబు మాటమాటలకు మోసపోయిన ఏపీ ప్రజలు పార్టీనే బహిష్కరించారు,, అంతేకాదు పూర్తి జోష్ లో ఉన్న పార్టీ ప్రస్తుతం చంద్రబాబు వైఖరి కారణంగా అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలో నూ నేతలు పక్కపార్టీల్లో చేరిపోతే..మిగిలన వాళ్లను దక్కించుకోవడం కోసం. ముఖ్యంగా క్యాడర్ ను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. అంతేకాదు తిరిగి నందమూరి వారసులకు అప్పగిస్తే తప్ప, టీడీపీ బతికి బట్టకట్టదన్న వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. అంతెందుకు బాబును నమ్మి , తెలంగాణలో అధికార పార్టీపై రెచ్చిపోయి, చివరకు చంద్రబాబు జిత్తులమారి ఎత్తులు తెలిసి, ఏకంగా బాబుపైనే తిరుగు బాటు ప్రకటించిన మోత్కుపల్లి ..ఈ వాదనను బలంగా వినిపిస్తున్నారు.. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత గత ఏడాది.ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులు అర్పించి అనంతరం మోత్కుపల్లి నర్సింహులు చేసిన బలమైన డిమాండ్..పార్టీని నందమురు వారసుల చేతిలో పెట్టాలని.. ప్రస్తుతం ఏపీలో బాబు పరిస్థితి చూస్తే.. ఎవరినుంచి పార్టీని లాక్కున్నారో ఆ కుటుంబం చేతిలో పార్టీని పెట్టక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూుమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో!

చేసిన పాపం ఎక్కడికీ పోదూ!

తమకు రాజకీయ బిక్ష పెట్టిన అన్నగారి వెన్నుపోటుకు సహకరించిన పాపం ఊరికో పోతుందా..? అవసరానికి వాడుకొని వదిలేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విధ్యే కదా. అందుకే వెన్నుపోటి సమయంలో ప్రజల నుంచి తిరుగబాటు రాకుండా నందమూరి కుటుంబాన్నే అడ్డం పెట్టుకున్న బాబు..మొదట పురందేశ్వరి భర్త, రామారావు పెద్ధళ్లునికి పదవి ఇచ్చినా ఆ తర్వాత పార్టీనుంచి బయటకు వెళ్లేలా అవమానాలు పాల్జేశారు. ఎవరి మాట వినని సీతయ్య హరికృష్ణ చంద్రబాబు మాట విని ఫలితం అనుభవించిన సంగతి తెలిసిందే.. రావాణా శాఖ మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి ఎన్నికల్లో వెన్నుపోటు పోడిచాడు.. ఓటమి పరాభవంతో బావను వీడి పార్టీ పెట్టినా ఫలితం దక్కలేదు. ఎందుకంటే ఎన్టీ ఆర్ కు కుటుంబం చేసిన ద్రోహం వాళ్లు మరిచినా ప్రజలు విస్మరించలేదు కాబట్టి..

ఇక అసలు విషయానికి వద్దాం.. చంద్రబాబుతో పాటు బహిష్కరణకు గురైన అశోక్ గజపతి రాజకీయ జీవితం ప్రస్తుతం అవమానాల పాలైంది..ఏపీలో ముఖ్యమంత్రి రాత్రి రాత్రి అశోకుని మాన్సాఫ్ ట్రస్ట్ కిరీటాన్ని తీసేసారు.. ఇతకాలం తిరుగులేని నేతగా ఉన్న అశోక్ గజపతికి..ఇంటి లోనే కుంపటి రాజేసింది ,సచయిత.. అదే నండి అశోకుని సోదరుని కూతురు.. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో మంత్రి పదవులు, కేంద్రంలో కూడా మంత్రి పదవి అనుభవించినా.. ప్రస్తుతం రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం చేతిలో ఘోర పరాభవం చవిచూడక తప్పలేదు. చంద్రబాబుకు సహకరించి ఎన్టీఆర్ ఆగ్రహానికి గురైన మరో వ్యక్తి మాజీమంత్రి విద్యాధర రావు. 21 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, అందులో 9 సంవత్సరాలు మంత్రిగా చేసిన విద్యాధర రావు, చివరకు పార్టీలో సరైన గుర్తింపులేక పీఆర్పీలో చేరారు. చివరకు పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం తర్వాత రాజకీయంగా ఆయన చరిస్మా మసక బారిందనే చెప్పాలి. అయితే అయన 2013లో కన్నుమూశారు. ఇప్పుడు ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ..

చంద్రబాబుకు వత్తాసు పలికిన మరో నాయకుడు ఎలిమినేటి మాధవ రెడ్డి..ఆయన చంద్రబాబు మంత్రి వర్గంలో మొదట హోం మంత్రిగా పనిచేశారు. అయితే ఉమ్మడి ఏపీలో తిరుగులేని నేతగా, అందులో రెడ్డి సామాజిక వర్గంలో ఎదురు లేని నేతగా ఎదుకుతున్న తీరు బాబుకు కంటగింపుగా మారింది. దీంతో మరుసటి మంత్రివర్గంలో .. పంచాయతీ రాజ్ శాఖను అప్పగించారు.. ఎందుకంటే ప్రభుత్వంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అయితే, నెంబర్ టు హో మంత్రి.. ఏక్షణమైనా నెంబర్ 2 నెంబర్ వన్ అవుతాడన్న భయంతో..అందులో వెన్నుపోటు వల్లే చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి.. వేరేవాళ్లు కూడా తనలాగే తనకు వెన్ను పోటు పొడు,స్తారన్న భయం.. ఆయన భయమే హోంమంత్రిగా నక్సల్స్ థ్రెట్ ఉందని తేలిసీ,శాఖను మార్చడంతో నిజంగానే మాధవ రెడ్డి నక్సల్స్ చేతిలో హతమయ్యారు. ఆ సమయంలో చంద్రబాబే నక్సల్స్ తో చంపించాడన్న ప్రచారం జరిగింది. ఏది ఏమైతేనేమి.. ఎవరు చంపించినా రామారావుకు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు సహకరించిన ఫలితం మాధవ రెడ్డికి తప్పలేదన్న ప్రచారమూ జరిగింది.

టీటీపీకి ముందు సమైక్య రాష్ట్రంలో రెడ్లు, ఖక్మ సామాజికి వర్గాల చేతిలోనా రాజీకీయాలు కొనసాగేవి. బడుగు బలహీన వర్గాలు ఓటు బ్యాంకుగానే ఉన్నారు. కొందరు బడుగు బలహీన వర్గాల వారు రాజకీయంగా ఎదిగినా, అధికార పదవలు పొందినా అది నామమాత్రమే.అయితే రామారావు టీడీపీ ,స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా గుర్తింపు వచ్చింది. అన్ని స్థాయిల్లో వాళ్లు రాజకీయ, అధికారిక పదవుల్లోకి వచ్చారు. ఆలా వచ్చిన వ్యక్తే దేవేందర్ గౌడ్. ఎన్టీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగారు.. అది మరిచిన గౌడ్ చంద్రబాబు వెన్నుపోటు కు సహకరించిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. విచిత్రమైన వ్యాధితో బాదపడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు హయాంలో హోం మంత్రిగా చేసినా, బీసీల ప్రతినిధిగా ఎదిగినా...వెన్ను పోటు ఫలితం ..ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp