ఏపీ వెయిటింగ్.. కార‌ణం ఇదే..!

By Kalyan.S Sep. 28, 2020, 07:01 am IST
ఏపీ వెయిటింగ్.. కార‌ణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌వాహం సంగ‌తి దేశంలోనే చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న విష‌యం విదిత‌మే. సాక్షాత్తూ దేశ ప్ర‌ధానే స్వ‌యంగా జ‌గ‌న్ ను అభినందిస్తూ మీ పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని, అన్ని రాష్ట్రాల‌లోనూ ఏపీ త‌ర‌హా పాల‌న రావాల‌ని కోరుకుంటున్నా.. అంటూ ప్ర‌శంసించిన విష‌య‌మూ తెలిసిందే. అతి త‌క్కువ కాలంలోనే ఇంత‌లా ఆద‌ర‌ణ పొందిన సీఎంల‌లో జ‌గ‌న్ ప్ర‌ముఖ స్థానం పొందార‌ని చెప్పొచ్చు.

అందుకు కార‌ణం.. ఆయ‌న 15 నెల‌ల కాలంలోనే 59 వేల కోట్ల రూపాయ‌లకు పైగా ప్రజా సంక్షేమం కోసం వెచ్చించారు. ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో అంత‌లా ఖర్చు చేసిన ప్రభుత్వం బ‌హుశా దేశంలోనే ఎక్క‌డా లేక‌పోవ‌చ్చు కూడా. జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌ను చూసి ప్ర‌తిప‌క్ష స‌భ్యులే మిత్ర‌ప‌క్షంగా మారిపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల‌లో ఇప్ప‌టికే ముగ్గురు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తూ సొంత పార్టీ తీరును బ‌హిరంగంగా ఎండ‌గ‌డుతున్నారు.

మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు రంగం సిద్ధం

ఏపీ సీఎం జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హించినా.. కేబినెట్ తో భేటీ అయినా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ప్ర‌జా సంక్షేమానికి సంబంధించి ఇంకేం నిర్ణ‌యాలు ప్ర‌క‌టిస్తారో అని ప్ర‌జ‌లంతా ఆతృత‌గా ఎదురుచూస్తుంటారు. వారి ఆశ‌ల‌కు అనుగుణంగానే ప్ర‌తి స‌మావేశంలోనూ తీపి క‌బుర్లు అందుతూనే ఉన్నాయి. కేబినెట్ భేటీల్లో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూనే ఉంది. ఎక్క‌డా జాప్యం జ‌ర‌గ‌కుండా త‌ర‌చూ స‌మావేశాలు నిర్వ‌హిస్తోంది. ఇదే క్ర‌మంలో కేబినెట్‌ మరోసారి భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో అక్టోబర్‌ 1న సమావేశం జరగనుంది.

వేగంగా భేటీలు

ఏపీలో గ‌మ‌నించాల్సిన మ‌రో అంశం కేబినెట్ భేటీ. మంత్రి వ‌ర్గం త‌ర‌చూ స‌మావేశం అవుతూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఏ రాష్ట్రంలోనూ అన్ని సార్లు బ‌హుశా స‌మావేశాలు నిర్వ‌హించ‌క‌పోవ‌చ్చు. గ‌త నెల‌లో కూడా స‌మావేశాలు నిర్వ‌హించిన మంత్రి వ‌ర్గం ఈ నెల‌లో రెండో సారి స‌మావేశం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్‌ 3న నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో ‘ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ’ అంశంపై చర్చ జరిగింది. రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం, రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి, ఏపీఎస్‌డీసీకి ఆమోదం, వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్‌ సిగ్నల్‌ వంటి పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో 1న జ‌రిగే కేబినెట్ భేటీలో ప్ర‌జా సంక్షేమానికి సంబంధించి మ‌రిన్ని నిర్ణ‌యాలు వెలువ‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌జ‌లంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp