ఎమ్మెల్సీ ఆశావాహులు ఆగాల్సిందేనా..?

By Jaswanth.T Jun. 18, 2021, 03:08 pm IST
ఎమ్మెల్సీ ఆశావాహులు ఆగాల్సిందేనా..?

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల సందడి నడుస్తోంది. దాదాపు రెండేళ్ళ తరువాత ఖాళీ అవుతున్న ఈ పదవులను తగిన అర్హత ఉన్నవాళ్లకు కేటాయించేందుకు సీయం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గవర్నర్‌ కోటాలో నలుగురిని ఎమ్మెల్సీలుగా ప్రకటించడం కూడా జరిగింది. దీంతో ఆశావల్లో ఉత్కంఠత పెరిగిపోతోందని చెబుతున్నారు పరిశీలకులు.

అయితే స్థానిక సంస్థల కోటాకింద ఖాళీ అయిన 8 ఎమ్మెల్సీ పదవుల్లో నియామకాలకు మరికొన్నాళ్ళు ఆగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల రిజల్ట్స్‌ కోర్టు పరిధిలోకి చేరిన నేపథ్యంలో, కోర్టు నిర్ణయం అనంతరమే వాటిని భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 8తో పాటు, గతంలోనే ఖాళీ అయిన 3 కలుపుకుని మొత్తం 11 ఎమ్మెల్సీ స్థానాలను స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సి ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ, వివిధ కార్పొరేషన్లు, వాటి డైరెక్టర్ల పోస్టులపై వైఎస్సార్‌సీపీలో ఆశావహుల జాబితా భారీగానే ఉన్నట్లు సమాచారం. ఎవరికి వారు తాము పార్టీకి చేసిన సేవలు, తమ ప్రాధాన్యతను వివరిస్తూ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ముఖ్యనాయకులను పలు మార్లు కలిసేసారు. సదరు నాయకులు సైతం ఆశావహుల విజ్ఞాపనలను సావధానంగానే వింటున్నారు. దీంతో ఆశావహులు ఎవరికి వారు ధీమాగానే ఉన్నారు.

Also Read : టీడీపీకి అక్కడ కూడా తలనొప్పులే, వైస్సార్సీపీ కి సంపూర్ణ ఆధిక్యం 

అయితే సామాజిక సమీకరణలతో పాటు, పార్టీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని సీయం వైఎస్‌ జగన్‌ తన నిర్ణయాలను తీసుకుంటున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ప్రకటించిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను వినూత్నంగానే ప్రకటించడమే నిదర్శనంగా చెబుతున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రాన్ని సంక్షేమం బాటలో పరుగులు పెట్టించిన సీయం వైఎస్‌ జగన్మోహన్‌రెడి ఇప్పుడు పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టిపెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజికవర్గ లెక్కల్ని పక్కాగా వేస్తూ ప్రత్యర్ధులకు దొరకని రీతిలోనే పదవులను భర్తీ చేస్తున్నారంటున్నారు. పదవీ బాధ్యతలు అప్పగిస్తున్న నాయకుడి సమర్ధతను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలకు కూడా జగన్‌ సిద్ధమవుతున్నట్లుగా భావిస్తున్నారు.

అయితే ఎమ్మెల్సీ ఆశావహుల జాబితా భారీగానే ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయిలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవుల భర్తీకూడా చేపట్టనున్న నేపథ్యంలో పార్టీకోసం అహర్నిశలు కష్టపడిన వారికి ఏదో ఒక పదవి రూపంలో న్యాయం జరిగేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ పదవుల భర్తీ ఆలస్యం మినహా, మిగిలిన అన్ని పదవులు భర్తీ అయితే మరోసారి వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్తసందడి నెలకోవడం ఖాయంగానే కన్పిస్తోంది.

Also Read : జగన్‌కు ఎలా సాధ్యమైంది..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp