కోర్టు కోర్టుకూ... తీర్పు తీర్పూకూ...!

By Chari.Ch Jan. 22, 2021, 11:30 am IST
కోర్టు కోర్టుకూ... తీర్పు తీర్పూకూ...!

ఏపీ పంచాయితీ ఎన్నికలు సుబ్బి చావుకు వచ్చినట్లుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఏపీ ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నయి. ఎస్‌ఈసీ రమేష్ కుమార్ప మొండి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా ప్రారంభ దశలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీ వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గక పోవడం, మరో వైపు వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభం కావడంతో..ప్రస్తుత పరిస్తితులు అనుకూలంగా లేవని,అందుకే ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం వాదిస్తోంది.ఇది చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు కోర్టుల చుట్టూ ఎన్నికలు తిరుగుతున్నాయి.

ఈ నెల 8న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అందువల్ల ఎన్నికలు నిర్వహంచలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ రద్దు చేయాలని హైకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. దీంతో వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని హైకోర్టు భావించి, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టేసిన సంగతి తలిసిందే. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని, అందువల్లే ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది.

పంచాయతీ ఎన్నికలపై సుదీర్ఘ వాదలను విన్న డివిజన్ బెంచ్ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ సింగిల్ జడ్జి తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగం ప్రకారం స్థానిక ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ విధి అని, ఎస్‌ఈసీకి ప్రభుత్వం తప్పనిసరిగా సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మరి ప్రభుత్వం ఊరుకుటుందా? హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్, సుప్రీం కోర్టు తలుపు తట్టింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. సో పరిస్తితి సేమ్ టు సేమ్..

ఇందంతా ఓకే..ఎవరి డ్యూటీ వారుచేస్తున్నారు. కానీ ఆదిలో ప్రజల ప్రాణాలు ముఖ్యమనే ధోరణిలో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, ఇప్పుడెందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు? అనేది చర్చనీయాంశం.. రెండూ రాజ్యాంగ బద్ద సంస్థలే..కానీ ఎవరి వాదనలు వారివి.. కానీ నిమ్మగడ్డ నేను అనుకున్నదే జరగాలి అన్న మంకు పట్టుతో వెళ్తున్నట్లు, ఇంకేదో ప్రయోజనం ఆశించి కోర్టుకు వెళ్లయినా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తుంది.

వాస్తవానికి రెండు సంవత్సరాల క్రితమే పంచాయతీ ఎన్నికలు జరగాలి. కాని టీడీపీ హయాంలో పంచాయతీ ఎన్నికల ఊసెత్తని నిమ్మగడ్డ ఇప్పుడెందుకు ఇంతలా న్యాయ పోరాటం చేస్తున్నట్లు.? అన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు పరిశీలకులు. నిమ్మగడ్డ ప్రతిపక్షాలకు మేలు చేసేందుకైనా లేదా తన ఇగోను తృప్తిపరుచుకునేందుకో యత్నిస్తున్నారిని అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఆది నుంచి ఏపీ పంచాయతీ ఎన్నికలు కోర్టుల చుట్టే తిరుగుతున్నాయి. హైకోర్టు, సుప్రీం కోర్టు. అయితే ఇక్కడ కోర్టులు తమ పరిధిలో తీర్పులు ఇస్తున్నాయి. కానీ ఓక్కోసారి ఒక్కోరకమైన తీర్పు..సింగల్ బెంచ్ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తే.. డివిజన్‌ బెంచ్‌ ఎస్ఈసీ ను సమర్ధిస్తూ ఎన్నిలను నిర్వహించాలని చెప్పింది.. ఇప్పుడు ప్రభుత్వ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. మరి సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు నిస్తుందో అన్న ఉత్కంఠ. దీంతో బొబ్బిలి పులి సినిమాలో హీరో అడిగినట్లు కోర్టు కోర్టుకు తీర్పు తీర్పుకూ ఇంత మార్పు ఉంటే అసలు న్యాయం ఉన్నట్లా లేనట్లా? అన్న సామాన్య ప్రజల సందేహాలకు సమాధానం ఎవరు చెప్పాలి?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp