నిమ్మగడ్డ నిధుల పిటిషన్‌: హైకోర్టు కీలక ఆదేశం

By Kotireddy Palukuri Oct. 21, 2020, 06:55 pm IST
నిమ్మగడ్డ నిధుల పిటిషన్‌:  హైకోర్టు కీలక ఆదేశం

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదని, నిధులు కేటాయించేలా ఆదేశించాలంటూ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. నిధుల లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇబ్బందులు ఎదుర్కొంటోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. వెంటనే నిధులు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిధులు కేటాయించామని హైకోర్టుకు తెలిపారు. అయితే ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp