అందుకే జగన్‌కు ఆ పేరు..!

By Kotireddy Palukuri Sep. 25, 2020, 06:48 pm IST
అందుకే జగన్‌కు ఆ పేరు..!

ప్రజలకు మేలు చేసే విషయంలో పాలకులు పలు రకాలు. ప్రకటనలు చేసి ఆ తర్వాత పట్టించుకోకుండా ఉండేవారు. చేసిన ప్రకటనల్లో కొన్ని అమలు చేసేవారు. చెప్పినవి చెప్పినట్లు చేసేవారు. ఏపీ యువ సీఎం వైఎస్‌ జగన్‌ చివరి కోవకే చెందుతారని ఆయన చేస్తున్న పనుల ద్వారా స్పష్టం అవుతోంది. ప్రజల జీవితాలను మార్చే అంశాలపై ప్రకటనలు చేయడమే కాకుండా.. వెంటనే వాటిని ఆచరణలోనూ పెడుతున్నారు.

వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ప్రజలు తమ జీవనం కోసం వ్యవసాయం, పాడి రంగాలపై ఆధారపడి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి జోడు చక్రాల మాదిరిగా ప్రతి కుటుంబ జీవన పయనం సాగుతుంది. వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన సీఎం జగన్‌.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, బీమా, పంటలకు మద్ధతు ధర తదితరాలు అన్నీ అందజేస్తున్నారు. పాడి రంగానికి సంబంధించి కూడా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలో సహకార డైరీ వ్యవస్థకు పూర్వ వైభవం కల్పించేలా ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (అమూల్‌) తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పాల సేకరణ, మార్కెటింగ్‌ అంశాలు అమూల్‌ పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన అమూల్‌ సంస్థ ప్రతినిధులు ఏపీలో పాల ఉత్పత్తిపై సమగ్ర వివరాలు సేకరించారు.

రాష్ట్రంలో 9,889 గ్రామాల్లో పశుపోషణ ఎక్కువగా ఉందని గుర్తించారు. పాల సేకరణ కేంద్రాలతోపాటు బల్క్‌ కూలింగ్‌ యూనిట్లు కూడా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 1000 – 2000 లీటర్ల సామర్థ్యం గల బల్క్‌ కూలింగ్‌ యూనిట్లు 5,386. 3–5 వేల లీటర్ల సామర్థ్యం గల యూనిట్లు 674 రాష్ట్రంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని అమూల్‌ ప్రతిపాదించింది. ఇందు కోసం 888 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. సీఎం ఆమోదం తర్వాత ఈ బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను గ్రామాల్లోనే ఏర్పాటు చేయనున్నారు.

సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు మంచి ధర లభించేలా చర్యలు చేపడతామని సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మార్కెట్‌లోని కంపెనీలు ఇచ్చే ధర కన్నా.. సహకార సంఘాలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయలు ప్రోత్సాహకం కింద అందిస్తామని హామీ ఇచ్చారు. అమూల్‌ ఆధ్వర్యంలో సహకార సంఘాలు తిరిగి ప్రారంభమైన తర్వాత పాడి రైతులకు ఆర్థికంగా మేలు జరగనుంది.

ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయల ప్రొత్సాహకం వల్ల ప్రైవేటు డైరీలు కూడా ఎక్కువ ధరను రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. తద్వారా కంపెనీల మధ్య పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించనుంది. ప్రస్తుతం రైతుల వద్ద కొనుగోలు చేసే పాల ధరకు.. వాటిని ప్యాకింగ్‌ చేసి వినియోగదారులకు అమ్మే ధరకు మధ్య వ్యాత్యాసం భారీగానే ఉంది. ఈ వ్యత్యాసం సొమ్ము అంతా కంపెనీలకు ఆదాయం రూపంలో వెళుతోంది. అమూల్‌ పర్యవేక్షణలో సహకార డైరీలు పని ప్రారంభిస్తే.. రైతుల కష్టం రైతులకే చెందే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp