కోవాగ్జిన్ ఆర్డర్లపై వివాదానికి స్వస్తి...లేఖ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం...

By Suresh May. 08, 2021, 06:02 pm IST
కోవాగ్జిన్ ఆర్డర్లపై వివాదానికి స్వస్తి...లేఖ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ రగడ రోజు రోజుకు ముదురుతోంది. అటుప్రతిపక్ష, అధికార పక్షాలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. తాజాగా భారత్ బయోటెక్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వలేదనే వదంతులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తాము భార‌త్ బ‌యోటెక్ వారి కోవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్ కోసం ఆర్డ‌ర్ ఇవ్వ‌లేద‌న్న ప్ర‌చారం అవాస్త‌వమని పేర్కొంది. ఈ మేరకు భార‌త్ బ‌యోటెక్ ఎండీ కృష్ణా ఎల్లాకు ప్ర‌భుత్వ‌ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ముద్దాడ ర‌విచంద్ర ఏప్రిల్ 24న రాసిన లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో ప్రధానంగా ఏపీలోని 18-45 మ‌ధ్య వ‌య‌సున్న 2.04 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున 4.08 కోట్ల వాక్సిన్ లు కావాల‌ని కోరుతూ ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున భార‌త్ బ‌యోటెక్ ఎండీ కృష్ణా ఎల్లాకు లేఖ రాశారు.

మాకు రోజుకు 6 ల‌క్ష‌ల మందికిపైగా వ్యాక్సినేష‌న్ పూర్తి చేయ‌గ‌ల మెకానిజం అందుబాటులో ఉంది కాబ‌ట్టి.. మీరు ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ్యాక్సిన్లు అంద‌జేయాల‌ని కోరుతున్నామని లేఖ‌లో పేర్కొన్నారు ముద్దాడ రవిచంద్ర ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. అంతేకాదు కోవిడ్ మేనేజ్ మెంట్ అండ్ వ్యాక్సినేషన్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కు అనుబంధంగా ఉన్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శలు ఆధార రహితంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు కౌంటర్ ఇచ్చాయి.

అంతేకాదు కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై గురువారం తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షలో ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆదేశించారు. టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలి. కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాల‌ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp