స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Kotireddy Palukuri Feb. 21, 2020, 08:09 am IST
స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కీలక ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు (డబ్బు, మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలను నిర్వహించాలని..) కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పులతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్టం (సవరణ) బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనుంది.

ఇవి తాజా నిబంధనలు..

తాజా ఆర్డినెన్సు తో స్థానిక సంస్థల్లో అక్రమాలకు చెక్ పడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. డబ్బు, మద్యంతో అభ్యర్థులు పట్టుబడితే మూడేళ్ల శిక్ష విధించడంతోపాటు పోటీకి అనర్హులవుతారు. అక్రమాలకు పాల్పడితే గతంలో ఉన్న 3–6 మాసాలు మాత్రమే శిక్షలు ఉండేవి.. ఇప్పుడు పదవి నుంచి తొలగించడంతో పాటూ గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించనున్నారు. సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండాలి.. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యత సర్పంచ్‌లకే అప్పగించారు. పంచాయితీ ఎన్నికలల్లో ప్రచార గడువు 5 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారగడువు 7 రోజులుగా ఇటీవల కేబినేట్ ఆమోదించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp