ఈఎస్‌ఐ స్కామ్‌: పితాని మాజీ పీఎస్‌ మురళి సస్పెన్షన్‌

By Krishna Babu Aug. 07, 2020, 07:15 pm IST
ఈఎస్‌ఐ స్కామ్‌:  పితాని మాజీ పీఎస్‌ మురళి సస్పెన్షన్‌

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ESI మందుల కొనుగోళ్ల కుంభకోణంలో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెమ్ నాయుడుతో సహా పలువురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కుంభకోణంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురళీ మోహన్ రావుని సైతం సచివాలయంలో విధుల్లో ఉన్న సమయంలోనే ఏసీబీ అధికారులు గత నెలలో అరెస్ట్ చేసారు.

టీడీపీ పాలనలో ESIలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టి చేసిన కొనుగోళ్లలో రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు రావడం , ఇదే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం మురళి మోహన్ రావు పాత్రపై ఆధారాలు దొరకడంతో అరెస్టు అయిన మురళిని సస్పెండ్‌ చేస్తూ మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి అందులో 10 మందిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp