పంట సాగుదారుకు హక్కు పత్రం

By Krishna Babu Jul. 08, 2020, 09:41 pm IST
పంట సాగుదారుకు హక్కు పత్రం

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవం నాడు మరో సంచలమైన నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కల్పించేలా అధికారంలోకి రాగానే అసెంబ్లీలో అప్పటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల చట్టం-2011ను రద్దు చేస్తూ ఆ స్థానంలో కొత్త కౌలు రైతుల చట్టం చేసిన సంగతి తెలిసిందే.

భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా ప్రభుత్వం నుండి వారికి ఆర్థిక సాయం, బ్యాంకుల నుంచి రుణం అందేలా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంతో ఇకపై కౌలు రైతులు సైతం పంట రుణం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా మొదలైన ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిoచారు. అయితే నేడు వైఎస్సార్‌ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌ రైతు దినోత్సవ కార్యక్రమంలో ఈ పత్రాన్ని విడుదల చేసి తమది రైతు ప్రభుత్వం అని ఇకపై కౌలు రైతులు కూడా ఈ పత్రం మూలాన అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి వచ్చే సహాయలు పొందేందుకు వీలు ఉందని చెప్పుకొచ్చారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp