ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు చేసిన ఏపీ సర్కారు

By Rishi K Jan. 18, 2021, 08:16 am IST
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు చేసిన ఏపీ సర్కారు

కరోనా కారణంగా విద్యా వ్యవస్థ కకావికలం అయింది.కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. కరోనా కారణంగా దెబ్బతిన్న విద్యావ్యవస్థను యథాస్థితికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా జనవరి 18 నుండి ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు. ఆదివారం కూడా తరగతులు జరగనున్నాయి. కానీ ఆదివారంనాడు ఏదేని ఒక సబ్జెక్ట్ లో మాత్రం తరగతి జరుగుతుంది. జాతీయ పండుగలకు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

నేటి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో వారికి వేసవికాలం సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆలస్యంగా విద్యా సంవత్సరం మొదలైనందున సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా వేసవి సెలవులు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. రెండో శనివారాలతో పాటు మే 31 వరకూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతులు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp