ఆంధ్రా సీఎస్ కు ఎక్సటెన్షన్

By Raju VS Aug. 08, 2020, 08:08 am IST
ఆంధ్రా  సీఎస్ కు ఎక్సటెన్షన్

ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేంద్రం నుంచి మరోసారి సానుకూల సంకేతాలు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విషయంలో పదవీకాలం పొడిగించేందుకు అంగీకరించింది. మరో మూడు నెలలు పాటు ఆమెను కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఆమెకు గతంలో ఓసారి మూడు నెలల పాటు పొడిగింపు ఇవ్వగా తాజాగా మరో మూడు నెలలకు అంగీకరించడం విశేషం.

ఏపీలో సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని పదవీకాలం గత జూన్ తో ముగిసింది. అయితే కరోనా సమయంలో ఆమెను కొనసాగించాలని, ఆరు నెలల పదవీకాలం కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం మాత్రం తొలుత మూడు నెలలు మాత్రమే పొడిగింపు ఇచ్చింది. దాంతో అది సెప్టెంబర్ నెలాఖరుతో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె పదవీకాలం పొడిగింపు కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో మరోసారి అనుకూలంగా ప్రకటన రావడం విశేషం.

ఈ ఏడాది చివరి వరకూ ఆమె సీఎస్ గా కొనసాగబోతున్నారు. సుమారుగా ఆరు నెలల పదవీకాలం పొడిగింపు దక్కడం విశేషం. రెండు దశల్లో ఆమె పదవీకాలం విషయంలో కేంద్రం నుంచి జగన్ ప్రతిపాదనలకు ఆమోదం లభిచండం ఆసక్తికరమేనని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇటీవల రిటైర్డ్ అధికారుల పదవీకాలం విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న తర్వాత కేంద్రం నుంచి జగన్ లేఖలకు అనుకూల నిర్ణయం వెలువడడం విశేషంగానే భావించాల్సి ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp