అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపీ సంచలనం

By Kalyan.S May. 07, 2021, 09:00 am IST
అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏపీ సంచలనం

ఇప్పుడు దేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు కేరాఫ్ గా ఏపీ నిలుస్తోంది. సంక్షేమంలోనైనా, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లోనైనా ముందంజ‌లో ఉంటోంది. తాజాగా అసైన్డ్ భూముల అంశంలో కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో దేవరయాంజల్ లోని అసైన్డ్ భూముల లొల్లి రాజ‌కీయాల్లో పెను మార్పుల‌కు కార‌ణ‌మైంది. ఆ భూముల‌ను క‌బ్జా చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మాజీ మంత్రి అయ్యారు. అనంత‌రం పార్టీకి కూడా దూరం అయ్యారు. ఆ వివాదం కొన‌సాగుతుండ‌గానే.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అధికార పార్టీ నాయ‌కుల‌కు సైతం అక్క‌డ భూములు ఉన్నాయంటూ కొత్త ర‌గ‌డ‌ను లేవ‌నెత్తారు. అక్ర‌మంగా భూముల‌ను క‌బ్జా చేసిన మంత్రులు కేటీఆర్, మ‌ల్లారెడ్డిల ను కూడా మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ కు చెందిన నిజ నిర్ధార‌ణ క‌మిటీ దేవ‌ర‌యాంజ‌ల్ లో ప‌ర్య‌టించింది కూడా. భూముల క‌బ్జా వాస్త‌వేన‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది.

భ‌విష్య‌త్ లో అన్యాయం జ‌ర‌గ‌కుండా

అసైన్డ్ భూముల వ్య‌వ‌హారం ప‌లు రాష్ట్రాల్లో స‌మ‌స్య‌లు తెచ్చి పెడుతుండ‌గా, ఏపీలో ఆ ప‌రిస్థితి రాకుండా ఉండేందుకు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆ భూముల‌ను తీసుకోవాల్సి వ‌స్తే అసైన్డ్ భూములకు ఇచ్చే పరిహారాన్ని పదింతలు చేస్తూ సంచలనం రేపారు. ఏపీలో ఇప్పటినుండి ఎక్కడైనా తప్పనిసరిగా భూ సేకరణ చేయాల్సిన పరిస్థితులు వస్తే ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములకు భారీ ఎత్తున పరిహారం చెల్లించాల్సిందే న‌ని చెప్పారు. సాగుభూములుగా రైత్వారీ పట్టా కలిగిన భూముల కంటే 10 శాతం అదనంగా అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. అసైన్డ్ భూములంటే ప్రభుత్వం పెత్తనం చేయకుండా భవిష్యత్తులోవారిలో అన్యాయం జరగకుండా పేదలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తాజా కేబినెట్ భేటీలో ఆమోదం

జ‌గ‌న్ నిర్ణయానికి ఇటీవ‌ల జ‌రిగిన‌ కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో జాతీయ భూ సేకరణ చట్టం-2013లో పేర్కొన్న దానికంటే అధికంగా పరిహారం చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రైత్వారీ భూములతో సమానంగా ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని 2013నాటి జాతీయ భూసేకరణ చట్టం చెబుతుండగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్ణయంతో ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములకు రైత్వారీ పట్టాల కంటే 10 శాతం అధికంగా పరిహారం దక్కుతుంది. నిజానికి ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని దివంగత సీఎం వైఎస్ 2007లోనే నిర్ణయించారని ఆ స్ఫూర్తితోనే 2013 జాతీయ భూసేకరణ చట్టం వచ్చిందని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

నాడు చంద్ర‌బాబు అలా..

అసైన్డ భూములకు రైత్వారీ పట్టాలు కలిగిన భూముల కంటే10 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములకు అతి తక్కువ పరిహారం ఇచ్చి వేలాది ఎకరాలు గుంజుకున్నారని ల్యాండ్ పూలింగ్ విధానానికి జాతీయ భూ సేకరణ చట్టం వర్తించదని వక్ర భాష్యం చెప్పారని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp