కాపు మహిళలకు 15వేలు

By Kiran.G Nov. 27, 2019, 03:46 pm IST
కాపు మహిళలకు 15వేలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని సమాచార శాఖా మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

ఆ వివరాలను తెలుపుతూ వైస్సార్ కాపునేస్తం పథకానికి 1101 కోట్లను కేటాయించామని,45 ఏళ్ళు దాటిన కాపు మహిళలకు ఏడాదికి 15 వేలు చొప్పున ఐదేళ్ళలో 75 వేలు అందజేయాలని కేబినెట్ ఆమోదించిందని, నవశకం సర్వే ద్వారా లబ్దిదారులను నేరుగా గుర్తించి వివిధ ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుందని మీడియాకు తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు కోసం NMDC తో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, జగనన్న వసతి దీవెనకు 2300 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకం కోసం 3400 కోట్ల నిధులను కేటాయించారని వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు. తితిదే పాలకమండలి సభ్యులను 19 నుండి 29 కి పెంచుతూ నిర్ణయం తీసుకుందని, సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డులను జారీ చేయాలనీ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్ని నాని మీడియాకి తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp