ఏపీలో మరో మంత్రికి కోవిడ్‌

By Jaswanth.T Sep. 28, 2020, 05:07 pm IST
ఏపీలో మరో మంత్రికి కోవిడ్‌

కోవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు దీని భారిన పడుతుండడంతో వారి అనుచరల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో మంత్రి కోవిడ్‌ బారిన పడ్డారు. ఏపీ బీసీ సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణకు కరోనా సోకింది. ఆయనకు ఇటీవల జరిగిన వైద్య పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.

దీంతో తనను కలిసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుటి మాదిరిగానే ఫోనులో అందుబాటులో ఉంటానని చెప్పారు. కాగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం నిర్మాణ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వేణు కూడా పాల్గొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp