కొనసాగుతున్న అసెంబ్లీ రగడ

By Bairisetty Nagaraju Dec. 13, 2019, 02:53 pm IST
కొనసాగుతున్న అసెంబ్లీ రగడ

మాట్లడితే 14ఏళ్ళు సీఎంగా పనిచేసిన అనుభవం, 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు, గేటు నెంబర్ 2 నుంచి రావాల్సిన చంద్రబాబు నాయుడు గేటు నెంబర్ 1 నుంచి రావడమే కాకుండా మార్షల్స్ పై పరుష పదజాలంతో విరుచుకుపడటం ఏంటని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడవ అసెంబ్లీ సమావేశంలో భాగంగా శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే గురువారం టిడిపి సభ్యులు మార్షల్స్ మధ్య జరిగిన తోపులాటపై చర్చ సాగింది. దీనిపై ఆసాంతం సభలో వీడియోలను ప్రదర్శించారు. తెలుగుదేశం సభ్యులంతా కలసి దాడి చేసినట్లు క్లీయర్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అని ప్రశ్నించారు. వీడియో క్లిప్పింగులను ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక మంత్రి బుగ్గన కల్పించుకుంటూ మనకు భద్రత కల్పించే వారి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్టా.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ప్రతిపక్షనేతలు ఎవరూ ఇలా ప్రవర్తించలేదు.. గతంలో చెవిరెడ్డి, ఆర్.కెల మీద దాడులు జరిగినా ఇలా దిగజారి ఎప్పుడూ ఎవరు ప్రవర్తించలేదు. నిన్నటి పసుపు సభ్యుల దాడిలో మార్షల్స్ కు చాలా గాయాలు అయ్యాయి.మరో పక్క ఆయన పత్రికలు అయ్యో ప్రతిపక్ష నేతను లోపలికి రానివ్వలేదు అందుకే ధర్నా చేశారనట్లుగా రాశాయి. వాస్తవం ఏమంటే వీళ్లే మార్షల్స్ పై దాడి చేసి పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ దాడి మనందరిమీద సభాపతి మీద ఆంధ్రప్రదేశ్ అంతటిపైనా దాడి జరిగినట్లే. ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే.. సభా గౌరవం. మర్యాద చాలా ముఖ్యం. ఇలాంటి చర్యలు భవిష్యత్ లో ఎవరూ చేయకుండా కనీసం ఆ ఆలోచన రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఉద్యోగులపట్ల ఎంత గౌరవం ఉందో నిన్నటి సంఘటనతో స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆయనకు కేటాయించిన గేటులో ఎందుకు రావడం లేదు. ఇంత సీనియర్ నాయకుడు అయి ఉండి ఇలా ప్రవర్తించడం దారుణం. గత శాసన సభలో నోరు విప్పితే సస్పెన్షన్ చేసేవారు. ప్రతిపక్ష సభ్యులపై భౌతిక దాడులకు దిగేవారు. సభా మర్యాదను కాపాడాలంటే భాదపడిన ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పడం ఆయనకే మంచిది. ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది మాట్లడకూడదు. సభా మర్యాదలను కాపాడటం చాల ముఖ్యం.. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

ఎమ్మెల్యే జోగి రమేష్ మైక్ అందుకుని టిడిపి సభ్యులు, చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీ.. 70 ఏళ్ళ వయసు ఉన్న బాబు.. మాలాంటి వాళ్లకు చెప్పాల్సింది పోయి.. వాళ్లపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం?.. వాళ్ళేమయినా టెర్రరిస్టులా.. లేక పాకీస్థానీలా.. వాళ్లు ఉన్నది మన భద్రత కోసం ఉన్నారు. వాళ్లు మన కుటుంబసభ్యులు అలాంటి వారిని దుర్భాషలాడి దూషించిన వాళ్లపై చర్యలు తీసుకుని న్యాయం చేయాల్సిందే. సభలో చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. విజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు. నూటికి నూరుపాళ్లు చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై స్పందిచిన టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో సినిమాను ప్రదర్శింపచేసి రక్తి కట్టించడానికి వైసీపీ శ్రేణులు చాలా శ్రమిస్తున్నాయని.. వాళ్లు ప్రదర్శించిన సినిమా హిట్ అయ్యిందని కాసేపు కామెడీ చేశారు. అనని మాటలు అన్నట్లు చిత్రికరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ని కూడా ఉన్మాదని అన్నామని ఎవరికి వినపించకపోయినా తమకు మాత్రమే వినిపించినట్లు కల్పించుకుని మరీ గొంతులు పెద్దవి చేసుకుని అరుస్తున్నారని అన్నారు.

బుచ్చయ్య వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి కురసాల కన్నబాబు.. మీరు పదే పదే ముఖ్యమంత్రిని ఉద్దేశించి సభలో ఉన్మాది అనే పదం ఉపయోగించడం కరెక్ట్ కాదని.. స్పీకర్ గారు ఈ వ్యాఖ్యలను రికార్డులనుండి తొలగించాలని కోరడంతో స్పీకర్ తమ్మినేని ఆ వ్యాఖ్యల్ని రికార్డులనుండి తొలగించాలని సూచించారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ కల్పించుకుంటూ మనం రోజు ఏదో మంచి పనిచేస్తున్నామని గలాట సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగించి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏమన్నా అంటే అన్ని నేనే చేశానంటాడు. ఉద్యోగులు అంటే గిట్టదు.. ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక ఆయన స్టైల్ లో స్పందిస్తూ.. అంత అనుభవం ఉన్న వ్యక్తి గౌరవం ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బాస్టర్డ్ అని అనడం దారుణమని అన్నారు. రాష్ట్రమంతా యూజ్ లెస్ ఫెలో అనుకునే మరో వ్యక్తి (లోకేష్).. ఓ అధికారిని పట్టుకుని అలా తిట్టడం కరెక్టా.. అంటూ లోకేష్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి.. ముఖ్యమంత్రిని పట్టుకుని ఉన్నాది అనడం కరెక్ట్ కాదు.. కనీసం క్షమాపణ చెబితే ఆయనకే హుందాతనంగా ఉంటుందన్నారు.

వీరి వాదనలు విన్న చంద్రబాబు మైక్ అందుకున్నారు. ఆయన స్టైల్ లో ఆయన సభ్యులకు హితభోద చేసే విధంగా ఆసాంతం ప్రసంగించారు. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ్యులకు సభ పద్దతులు నేర్పించాను. మరి జగన్ ఏం నేర్పించారు. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్లకార్డులు తెచ్చి మరీ ఆందోళనలు చేసారు. అయినా మేము ఎప్పుడు అడ్డుకోలేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేం భయపడం. నేను ఇప్పుడే కాదు ఎప్పుడు ప్రజాస్వామ్యబద్దంగానే వ్యవహరిస్తున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకున్నారు కాబట్టే కొంచెం పరుష పదజాలం ఉపయోగించాను. నాకు అవమానం జరిగిందా లేదా అది చెప్పండి. నాకు జరిగిన అవమానం గురించి విచారణ వ్యక్తం చేయండి నేను కూడా విచారణ వ్యక్తం చేస్తామని ముగించారు.

స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం, చంద్రబాబు గారు విజువల్స్ చూశాం. అన్ పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించారు. సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత సీనియర్ గా ఉన్న మీరు అలా ఎలా ప్రవర్తించారు. ఎవరికైనా ఎమోషన్స్ వస్తాయి. అర్ధం చేసుకోగలం. మనబోటి స్థాయివాళ్లు సభ్యుల అభిప్రాయలను గౌరవించి పశ్చత్తాపాన్ని ప్రకటించండి. ఇందులో అవుటర్స్ ఉంటే క్రిమినల్ కేసులు పెట్టండి. అంతే కాని మీ మీద నాకు ఎలాంటి దురభిప్రాయం లేదని తనకు అందరూ సమానులే అంటూ సూచించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp