ఆంధ్రజ్యోతి రాతల్లో అసలు కోణమిదే, మీకు అర్థం కావాలంటే చదవండి

By Raju VS Sep. 24, 2021, 03:30 pm IST
ఆంధ్రజ్యోతి రాతల్లో అసలు కోణమిదే, మీకు అర్థం కావాలంటే చదవండి

జగన్ అనుభవరాహిత్యం.. ప్రభుత్వ విధానాలపై అవగాహనా లోపం...దుందుకుడు వైఖరి తప్ప ఆలోచన లేదు... పదే పదే న్యాయస్థానాల్లో చుక్కెదురవుతున్నా సీఎం తీరు మారడం లేదు.. జగన్ వల్ల ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కట్లలో పడుతున్నారు. ఇవన్నీ కొంతకాలంగా ఆంధ్రజ్యోతి చేస్తున్న ఆరోపణలు. వాటిలో వాస్తవమున్నా లేకున్నా వాళ్లకు తోచింది రాస్తూ నిత్యం పాఠకుల్లో జగన్ పట్ల వ్యతిరేకతను పెంచడమే ఏకైక లక్ష్యంగా వారి రాతలుంటాయి.

ఇన్నాళ్లుగా ఆంధ్రజ్యోతి రాసింది నిజమే అనుకుందామా అంటే తాజాగా జ్యోతి రాతల్లో ఒక్కసారిగా యూటర్న్ కనిపించింది. యూటర్న్ లు కేవలం చంద్రబాబు సొంతమే అనుకుంటే పొరపాటు..ఆయన అనుచరులందరిలోనూ ఇది ఆనవాయితీగా వచ్చే లక్షణమని చాటుకుంది. తాజాగా ఆంధ్రజ్యోతి సూత్రీకరణ ఏమంటే జగనన్నది బ్లేమ్ గేమ్ మాత్రమే. న్యాయస్థానాల్లో నిలవవని తెలిసినా ఆయన చట్టాలు చేస్తున్నారు. కోర్టులు కొట్టేస్తే విపక్షాలు, మీడియా మీద పడుతున్నారు. ఇదంతా పక్కా వ్యూహాత్మకంగా జగన్ సర్కారు గేమ్ ప్లాన్ అంటూ రాసుకొచ్చింది.

నిన్న మొన్నటి వరకూ జగన్ కి అవగాహన లేదు..పాలన చేయలేకపోతున్నాడు...కోర్టుల్లో చీవాట్లు పడుతున్నాయి అంటూ సూత్రీకరించిన ఆంధ్రజ్యోతే ఇప్పుడు హఠాత్తుగా జగన్ చాలా పక్కా ప్లాన్ తో వెళుతున్నాడు.. అంతా స్కెచ్ ప్రకారమే సాగుతున్నాడు అని రాసుకొచ్చింది. అంటే ఇన్నాళ్లుగా జ్యోతి రాతల్లో జల్లిన విషయం వాస్తవం కాదనుకోవాలా.. లేక ఈరోజు రాసింది పెద్ద వక్రీకరణగా చూడాలా.. బాబు రెండు కళ్ల సిద్ధాంతానికి, ఈ రాధాకృష్ణ రెండు గొంతుల నినాదం ఏమిటో అంతుబట్టడం లేదంటారా..

Also Read : అదానీ రావడం లేదని నాడు - వచ్చేస్తున్నాడని నేడు, ఆంధ్రజ్యోతి అక్కసు రాతలు

ఇక్కడే ఆంధ్రజ్యోతి అసలు నైజం అర్థం చేసుకోవాలి. రెండున్నరేళ్లుగా జగన్ మీద , ఆయన ప్రభుత్వం మీద ఆంధ్రజ్యోతి వక్రభాష్యాలతో కహానీలు అచ్చేయని రోజు లేదు. అంతగా ప్రభుత్వ వ్యతిరేకత పెంచే పనిలో ఆ పత్రిక ఉంటుంది. కానీ ఆశించిన స్పందన కనిపించడం లేదు. అనుకున్నదొకటి..అయ్యిందొకటి అన్నట్టుగా ఉంది. చివరకు పరిషత్ ఎన్నికల్లో కూడా జగన్ కి అనూహ్యంగా 90 శాతం ఓట్లు పడడం ఆశ్చర్యం కలిగింది. టీడీపీ బాయ్ కాట్ చేసిందని పైకి చెబుతున్నా అంతర్గతంగా తమ పార్టీ శ్రేనులు కూడా వాటిని విశ్వసించడం లేదు. ఈ విషయం టీడీపీ నేతలకు, వంత పాడే మీడియాకు బాగా తెలుసు. అందుకే తాజాగా గొంతు సవరించే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. తాము రాసిన రాతలకే భిన్నమైన ధోరణిలో కూడా కొత్త భాష్యాలు చెప్పేందుకు సిద్ధమవుతోంది.

అదే సమయంలో జగన్ కి అవగాహన లేదని ఓ వర్గంలో అపోహలు పెంచడం ద్వారా కొంత సాధించామని నమ్ముతున్న ఈ పచ్చ బ్యాచ్ ఇప్పుడు ఇంకా జగన్ మీద ఆదరణ ఉన్న వర్గాల్లోనూ అపోహలు పెంచాలనే లక్ష్యానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అదే కథనంలో పరిశీలన లేకుండానే జీవోలు ఇస్తున్నారని రాయడం వెనుక అసలు ఉద్దేశం అదేనని భావించాల్సి వస్తోంది. దాంతో పాటుగా న్యాయస్థానాల విషయంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయనే ఎక్కువ మంది భావిస్తుండడంతో వారిలో జగన్ కి తెలిసే ఇదంతా జరుగుతుందనే అభిప్రాయాన్ని చొప్పించే ప్రయత్నంగా కనిపిస్తోంది. మొత్తంగా జ్యోతి రాతల్లో చిత్ర విచిత్ర విన్యాసాల పరంపర వెనుక పచ్చ బ్యాచ్ ఎంత ప్రయాసపడుతుందో అర్థమవుతోంది.

Also Read : కళ్ళు తెరిచిన ఆంధ్రజ్యోతి , భారీగా పెట్టుబడుల మీద కథనం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp