మోడీకే గనుక తెలుగు వస్తే.... ఆ వార్తలు చూసి ఆశ్చర్యపోతారు..!

By Voleti Divakar Oct. 30, 2020, 10:30 am IST
మోడీకే గనుక తెలుగు వస్తే.... ఆ వార్తలు చూసి ఆశ్చర్యపోతారు..!

ప్రధాని నరేంద్రమోడీకే గనుక తెలుగు భాష వస్తే తెలుగుదేశం అనుకూల మీడియా రాతలు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి కావడం ఖాయం. ఇలాంటి మీడియా జాతీలో తప్ప జాతీయస్థాయిలో లేకపోవడం పట్ల అంతరంగికంగా విచారం కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. అవినీతి కేసుల్లో జాప్యం కుంభకోణాలకు పునాది అని, వారసత్వ అవినీతి దేశాన్ని చెదపురుగులా తినేస్తోందని అవినీతి వ్యతిరేకత పై జరిగిన జాతీయ విజిలెన్స్ కాన్ఫరెన్స్ లో ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిని ఇక ఏమాత్రం సహించమని కూడా ఆయన హెచ్చరించారు.

ఈవారను తెలుగుదేశం మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇక పూర్తిగా పచ్చరంగు వేసుకున్న ఆంధ్రజ్యోతి ఆ వార్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే వ్యాఖ్యానించారని, ఆయన త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటూ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించి ఆనందించింది. ఇదే వార్తను తమ ఆశ్రితుడు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు కూడా అన్వయించవచ్చన్న విషయాన్ని ఆ పత్రిక మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి గురించి ఆంధ్రజ్యోత ప్రస్తావించి ఉంటే బాగుండేది.

అలాగే చంద్రబాబు పై టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతీ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసు కూడా పెండింగ్ లో ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఈ కేసుల్లో కేంద్రం వేగంగా స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం మీడియా ప్రధాని మోడీ వ్యాఖ్యలను జగన్ కు అన్వయించడంలో దురుద్దేశం స్పష్టమవుతోంది.

భాష తెలిస్తే తెలుగుదేశం మీడియా అమోఘమైన అన్వయశక్తికి మోడీ ఫిదా అవడం ఖాయం. జాతీయస్థాయిలో ఇలాంటి మీడియా తనకు దన్నుగా ఉంటే బాగుంటుందని కూడా ఆయన భావించినా ఆశ్చర్యం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp