అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ఓ పిచ్చి సినిమా -కేఏ పాల్

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై కేఏ పాల్ స్పందించారు. ఇది ఒక పిచ్చి సినిమా అని ఈ సినిమా ద్వారా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూశారని ఆరోపించారు. తన సీన్ల తో సినిమా రిలీజ్ అవదని ముందే చెప్తే తనని అపహాస్యం చేశారన్నారు. ప్రార్ధనలు చట్టాల సహకారంతో సినిమాలో ఎక్కడా తన పేరు ఉపయోగించకుండా చెయ్యగలిగానన్నారు. అబద్దాలు చెప్పి, మోసాలు చేసి సినిమా ట్రైలర్ లు రిలీజ్ చేశారని ఆరోపించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫోటోని మార్ఫింగ్ చేసి తాను అనుమతిచ్చినట్టుగా ఫోటోని రూపొందిచడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆర్జీవికి దేవుడు, చట్టం, కోర్టు, సెన్సార్ బోర్డు బుద్ది చెప్పాయన్నారు.
యేసు ప్రభువుని అవమానించి ప్రజల్లో శాంతి ని ప్రచారం చేస్తున్న నన్ను కూడా ఆర్జీవీ అవమానించాడు. చివరికి మూవీ ప్లాప్ అయ్యింది. వర్మలో గర్వం తగ్గి జనానికి ముఖం చూపించలేకపోతున్నాడు. ఇంకా చైనా నుండి వచ్చాడో రాలేదో.. నేపాల్ వెళ్లి, చైనా వెళ్లానని అందర్నీ నమ్మిస్తాడని ఎద్దేవా చేసాడు. అసలు ఆర్జీవీ నోరు విప్పితే అన్ని అబద్దాలే. గతంలో ఓ ఛానెల్ లో తనకి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నాడు ఎప్పుడూ ఎవరో ఒకరిని ఫూల్ చేయాలనుకుంటాడని కేఏ పాల్ అన్నారు.
ఇకనైనా ఆర్జీవీ ఇలాంటి చీప్ పబ్లిసిటీని మానుకొని నన్ను, దేవుడిని క్షమాపణలు కోరితే మళ్ళీ సినిమాలు హిట్ అవుతాయని, లేదంటే ఇలానే చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని జోస్యం చెప్పారు. ఇప్పటికే అతన్ని తన కుటుంబం, ప్రజలు వెలివేశారని, ముంబైలో సినిమాలు లేక, ఆంధ్రాలోను లేక ఎవరూ అవకాశాలు ఇవ్వక, చివరికి ఎవరో ఇచ్చిన డబ్బులకోసం ఈ "అమ్మ రాజ్యంలో కడప రెడ్లు" సినిమా తీసాడని కేఏ పాల్ రామ్ గోపాల్ వర్మ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కేఏ పాల్ తనపై చేసిన ఈ వ్యాఖ్యలపై వర్మ ఎలా ప్రతిస్పందిస్తాడో వేచి చూడాలి.


Click Here and join us to get our latest updates through WhatsApp