అమెరికా అధ్యక్షుడికి కరోనా...

By Srinivas Racharla Oct. 02, 2020, 05:35 pm IST
అమెరికా అధ్యక్షుడికి కరోనా...

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం సంచలనంగా మారింది.తనకు కరోనా సోకిన విషయాన్ని యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ ట్విట్టర్‌లో స్వయంగా ప్రకటించాడు.

డొనాల్ట్ ట్రంప్ ఉన్నత సలహాదారిణి హోప్ హిక్స్‌కి కరోనా పాజిటివ్‌గా అని తేలింది.దీంతో అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లకు గురువారం రాత్రి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.శుక్రవారం ఉదయం వచ్చిన ఫలితాలలో ట్రంప్‌ దంపతులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.ట్రంప్ సలహాదారు అయిన హోప్ హిక్స్ అధ్యక్షుడి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆయనతో పాటు కలిసి తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు.

గత మంగళవారం ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌ కార్యక్రామానికి కూడా ట్రంప్‌తో కలిసి ఆమె వెళ్లారు.అలాగే మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీ తరువాత మెరైన్ వన్ హెలికాప్టర్‌లో ట్రంప్‌తో పాటే ఆమె ప్రయాణించారు.ఈ నేపథ్యంలో తన సలహాదారు ద్వారా ట్రంప్ దంపతులకు వైరస్ సోకినట్లు వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి.

ట్రంప్ చేసిన ట్వీట్‌లో "తన సలహాదారు హోప్‌ హిక్స్‌ విరామం లేకండా నిరంతరం ప్రచార విధులలో నిమగ్నమై ఉండడంతో కోవిడ్ బారిన పడ్డారని,ఇది చాలా బాధాకరమని " అని పేర్కొన్నారు.తనతో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు కూడా కరోనా నిర్ధారణ అయిందని వెల్లడించారు.తాము క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించి తగిన చికిత్స తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని,తన అధ్యక్ష బాధ్యతలను యధావిధిగా నిర్వహిస్తానని ట్రంప్‌ తెలిపారు.

ఇక అధ్యక్ష ఎన్నికలలో కీలకమైన చివరి వారాల ప్రచారానికి ట్రంప్ దూరం కానున్నారు.ఇది ఎక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బ తీస్తుందోనని రిపబ్లికన్ పార్టీ ఆందోళన చెందుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp