టిక్‌టాక్‌పై నిషేధం విధించిన అమెరికా

By Kiran.G Aug. 07, 2020, 10:36 am IST
టిక్‌టాక్‌పై నిషేధం విధించిన అమెరికా

45 రోజుల్లోగా అమలు

కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా దేశంపై తన ఆగ్రహాన్ని పలు సందర్భాల్లో వ్యక్తపరచిన విషయం తెలిసిందే. కాగా అమెరికా అధ్యక్షుడు తాజాగా టిక్ టాక్ పై బ్యాన్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

ఇప్పటికే భారత్ చైనాకు చెందిన పలు అప్లికేషన్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అందులో ప్రముఖ అప్లికేషన్లు టిక్ టాక్.. యూసీ బ్రౌజర్, షేర్ ఇట్ లాంటివి ఉన్నాయి. అప్పటినుండి టిక్ టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. అమెరికాలో కూడా టిక్ టాక్ ని నిషేధిస్తామంటూ ట్రంప్ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.

తమ దేశ రహస్యాలను చైనాకు చేరవేస్తుందన్న నెపంతో చైనాకు చెందిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన బైట్‌డాన్స్ కంపెనీని టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు విక్రయించాలని లేదంటే బ్యాన్ తప్పదని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌పై బ్యాన్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ బ్యాన్ 45 రోజుల్లోగా అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. సెప్టెంబర్ 15 లోగా ఈ డీల్ ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp