జిల్లాల్లో మొద‌లైన అంబులెన్స్ సేవ‌లు.. జ‌గ‌న్ కు క్షీరాభిషేకాలు..

By Kalyan.S Jul. 03, 2020, 09:14 am IST
జిల్లాల్లో మొద‌లైన అంబులెన్స్ సేవ‌లు.. జ‌గ‌న్ కు క్షీరాభిషేకాలు..

దేశమే నివ్వెర‌పోయేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒకేరోజు 1088 అత్యంత అధునాత‌న అంబులెన్స్ ల‌ను అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. వెంట‌నే అవ‌న్నీ పేద‌ల సేవ‌ల్లో నిమ‌గ్నం అయ్యాయి. ఏ జిల్లాకు కేటాయించిన వాహ‌నాలు ఆయా జిల్లాల‌కు చేరువై పోయాయి. కుయ్.. కుయ్.. మంటూ తిరుగుతున్న వాటిని చూస్తున్న‌స్థానికులు ఏ కార్పొరేట్ ఆస్ప‌త్రికి చెందిన వాహ‌నాలో అనుకుని తొలుత పొర‌బ‌డుతున్నారు. వాటిపై 108, 104 నెంబ‌ర్ల‌ను చూసి ఇవి ప్ర‌భుత్వ వాహ‌నాలే అని తెలుసుకుని సంబ‌ర ఆశ్చ‌ర్యంలో మునిగిపోతున్నారు. ఆప‌ద‌లో ఉన్న వ్య‌క్తి ఫోన్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల్లోనే అవి చేరుకునేలా వాటిని సిద్ధం చేశార‌ని విని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. తండ్రి వైఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి వీటికి అంకురార్ప‌ణ చేస్తే.. అత్యంత అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన‌వి అందుబాటులోకి తెచ్చి పేద‌ల‌కు సేవ చేయ‌డంలో తండ్రికి మించిన త‌న‌యుడిగా పేరు పొందుతున్నార‌ని కొనియాడుతున్నారు.

స్థానిక నాయ‌కులు, ప్ర‌జ‌లు జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌కు క్షీరాభిషేకాలు చేస్తూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌టి కష్ట కాలంలో నూ జ‌గ‌న్ బాబు పేదోడి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని చాలా మంది త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. నాడు వైఎస్సార్ ప్రవేశపట్టిన అత్యుత్త‌మ‌ ప‌థ‌కాల‌కు... నేడు ఆయన తనయుడు జగన్ పునర్జీవం పోస్తున్నార‌ని కొనియాడుతున్నారు. ఎంతో న‌మ్మ‌కంతో ఓట్లు వేసి అత్యంత మెజారిటీ తో గెలిపించినందుకు త‌మ న‌మ్మ‌కం ఒమ్ము కాలేద‌ని జ‌గ‌న్ కు జ‌య‌జ‌య ధ్వానాలతో హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆయా జిల్లాల్లో...

జిల్లాల‌కు చేరుకున్న అంబులెన్స్ ల‌ను స్థానిక మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు ప్రారంభించి సేవ‌ల‌ను స్థానికంగా అందుబాటులోకి తెచ్చారు. విశాఖ జిల్లాకు కేటాయించిన 61 వాహ‌నాల‌ను పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆంధ్ర‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆరోగ్య విప్లవం తీసుకొచ్చారని అన్నారు. ప్రతీ పేదవానికి కార్పోరేట్ వైద్యం ఉచితంగా అందించ‌డ‌మే ప్ర‌భుత్వం ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. నాడు వైఎస్సార్ వైద్య, విద్యా రంగాలకి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఆయన కీర్తి దేశ విదేశాల్లో మారుమోగిందని తెలిపారు. ఆయన తనయుడిగా తండ్రిని ‌మించిన స్ధాయిలో పేదల సంక్షేమానికి కృషిచేస్తున్నారని చెప్పారు.

అలాగే.. 104 వాహ‌నాలు 39, 108 వాహ‌నాల‌ను 62 తూర్పుగోదావ‌రి జిల్లాకు చేరుకున్నాయి. వీటిని రాజ్య‌స‌భ స‌భ్యుడు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, ఎంపీ వంగా గీత‌ ప్రారంభించారు. ఇలా అన్ని జిల్లాల‌కూ నూత‌న అంబులెన్స్ లు చేరుకున్నాయి. పేద‌ల‌కు సేవ‌లందించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. మ‌రోవైపు.. అంబులెన్స్ ల‌ను అందుబాటులోకి తెచ్చిన రోజే.. భారీగా వేత‌నాలు పెంచుతూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో 104, 108 సిబ్బంది కూడా ఉత్సాహంగా, మ‌రింత బాధ్య‌తాయుతంగా పేద రోగుల‌కు సేవ‌లు అందిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp