బాబుగారి ప్లానింగా మజాకా !!

By Raju VS Sep. 18, 2020, 02:10 pm IST
బాబుగారి ప్లానింగా మజాకా !!

దేశ పార్లమెంట్ కన్నా తాత్కాలిక సచివాలయానికే ఎక్కువ ఖర్చు - విస్తుపోతున్న ప్రజలు

కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్లు, వివిధ శాఖల అధిపతులు , ఓ పాతిక ముప్పయిమంది మంత్రులు సిబ్బంది కూర్చునే సచివాలయ నిర్మాణానికి 2015లోనే దాదాపు రూ.750 కోట్లు ఖర్చు అయితే లోక్ సభ రాజ్యసభ సభ్యులు 800 మంది కూర్చునే సభలు, వేర్వేరు సమావేశ మందిరాలు, లైబ్రరీలు,సెంట్రల్ హాళ్లు , వివిధ పార్టీల కార్యాలయాలు ఉండే పార్లమెంట్ భవనం నిర్మాణానికి ఈరోజుల్లో ఎంత ఖర్చు అవ్వాలి.. ఆ 2015 లెక్కలతో పోలిస్తే కనీసం రెండుమూడు వేల కోట్లయినా అవ్వాలి. కానీ చిత్రంగా రూ.861 కోట్లతోనే టాటా సంస్థ ఆ విభాగాలన్నీ ఉండే పార్లమెంట్ భవనాన్ని కట్టిస్తాను అని ఒప్పుకుంది. ఆ సంస్థకే ఈ కాంట్రాక్టు కూడా దక్కింది. దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ జనాలు విస్తుపోతున్నారు. బాబుగారు ఏది చేసినా గ్రాండ్ గా ఉండాలి.. పావలా అయ్యేదానికి ఐదు రూపాయలు ఖర్చు చేయాలి. ఇదే ఆయన నైజం అని మళ్ళోక్కసారి గుర్తు చేసుకుంటున్నారు.

2015లో తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి .. అదికూడా తాత్కాలిక భవనానికి దాదాపు రూ.750 కోట్ల ఖర్చు చూపించారు.ఆ మేరకు లార్సన్ అండ్ ట్యూబ్రోసంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి దానికి అయ్యే వాస్తవ ఖర్చు ఎంతో, ప్రభుత్వ పెద్దలకు కమిషన్లు ఎంత ఇచ్చారోగాని అది వాన కురిస్తే చాలు నీళ్లు కరిపోతుంది. ఎక్కడి నుంచి పెచ్చులు రాలిపోతాయో తెలీదు. అప్పటి సిమెంట్ ఇసుక నిర్మాణంలో వాడే ఇనుము ధరలు ఇంకా కూలీల ఖర్చులతో దాని మొత్తం బడ్జెట్ రూ.750 కోట్లుగా వేశారు. మరి ఆరేళ్ళ తరువాత అంటే 2020లో ఇప్పుడున్న ధరలతో చూసుకుంటే తాత్కాలిక సచివాలయం కన్నా భారీ భవనం పలు విభాగాలు, పలు హాళ్లతో కూడిన భవనాన్ని రూ.861 కోట్లకే ఇప్పుడు కడుతున్నారు అంటే ఇది అత్యంత చవగ్గా , తక్కువ ధరలకే చేపడుతున్నట్లు తెలుస్తోంది.అంటే ఆరోజుల్లో చంద్రబాబు ఒక్కో భవనానికి ఎంతెంత అదనపు డబ్బులు చెల్లించారో.ఎంతెంత దుబారా చేశారో ఈ ఒక్క ఉదాహరణతో స్పష్టం అవుతోంది.. ఏదైనా మా బాబుగారు గ్రాండ్ అనుకునేవాళ్ళు అనుకుంటారు..కానీ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తుంటారు..సమయం వచ్చినప్పుడు ఓట్లతో గుణపాఠం చెబుతూనే ఉంటారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp