అసలు ఆట మొదలు ఇప్పుడే! తమ్ముడా ఆనంద పడకు!!

By Mavuri S Jan. 20, 2021, 03:30 pm IST
అసలు ఆట మొదలు ఇప్పుడే! తమ్ముడా ఆనంద పడకు!!

దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అనేది సామెత... ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో సీఐడి నమోదు చేసిన కేసులు హై కోర్టు కొట్టివేయడం లో టీడీపీ ఘనత ఏముంది..? పిటిషనర్లు కు ఊరట కలిగితే టీడీపీ ఆనందంలో అసలు కారణం ఏంటి? అసలు ఆ పార్టీ కు సంబంధం ఏమిటి? అంటే పిటిషనర్లు అంతా టీడీపీ పార్టీ వారా లేక టిడిపి కి సంబంధించిన వార? అసలు ఈ కేసులో ఇంక పూర్తి కాకముందే టిడిపి సంబరాలు చేసుకోవడం లో ఏదో ఉంది. ప్రభుత్వం మీద విజయం సాధించినట్లు టీడీపీ తమ్ముళ్లు భావిస్తే అది తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ కేసును ఇప్పుడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం లో వాదించేందుకు సిద్ధం అవుతోంది.

ఇన్ సైడర్ కాకపోవచ్చు కానీ...

కృష్ణ గుంటూరు జిల్లాల మధ్య అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే కొందరికి ప్రభుత్వ పెద్దలు చెప్పి భూములు కొనడం అనేది ఇన్ సైడర్ ట్రేడింగ్ కిందకు రాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో మాత్రమే వాడే పదమే కావచ్చు. అయితే అమరావతి దగ్గర రాజధాని వస్తుందని ముందే లీక్ చేయడం మాత్రం తప్పు కదా..? మరి దీనికి పేరు ఏం పెట్టాలి అనేది ఆలోచించి... ఆ పరిధిలో మరోసారి కేసు నమోదుకు రంగం సిద్ధం చేయవచ్చు.

కేసులో తీర్పును వెలువరిస్తూ గుంటూరు కృష్ణ మధ్య రాజధాని వస్తుందని చాలామందికి ముందుగానే తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంలో భిన్న వాదనలు న్యాయనిపుణులు చెబుతున్నారు. మొదటి నూజివీడు దగ్గర తర్వాత తెనాలి దగ్గర, మరోసారి ఏలూరు విజయవాడ గుంటూరు కలుపుతూ త్రినగరి అంటూ ప్రభుత్వం రకరకాల ప్రకటనలు ఇచ్చిందని కృష్ణా గుంటూరు మధ్యలోని అమరావతి దగ్గర రాజధాని రాబోతుందని కొంతమందికి మాత్రమే తెలుసు అన్నది న్యాయనిపుణులు లేవదిస్తున్న మాట. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సైతం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని వారు చెబుతున్నారు.

భూముల క్రయ విక్రయాలకు సంబంధించి దాని రేటు పెరిగినప్పుడు, ఏదో నేరం జరిగింది అని చెప్పడానికి వీలు లేదు అన్నది కోర్టు మాట. అది నిజమే కావచ్చు. అయితే దీనిలో రైతులకు తెలియకుండా కేవలం పెద్దలకు మాత్రమే రాజధాని వస్తుందని ముందుగానే తెలుసుకుని రైతుల వద్ద భూములు కొని వాటిని రాజధాని వచ్చిన తర్వాత విలువ పెంచుకోవడం మాత్రం మోసం కిందకే వస్తుంది అన్నది న్యాయ నిపుణుల మాట.

అక్కడ పిటిషనర్ లే కాదు చాలా మంది రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలు చేశారనేది కోర్టు వ్యాఖ్యనం. అయితే ప్రభుత్వం గుర్తించిన విచారణలో తేలిన వాస్తవాలను బట్టి పిటిషనర్లు మీద కేసులు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అమరావతి వస్తుందని ముందుగా తెలుసుకొని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వారినే పోలీసులు కేసులు పెట్టారు. భూములు కొన్న అందరిమీద సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర ) నమోదు చేయలేదు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రైతుల వద్ద నుంచి ఒక పద్ధతి ప్రకారం... రాజధాని వస్తుందని తెలుసుకొని కొన్న వారి మీదనే కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇది కేసులో కీలకమైన అంశం.

సీబీఐ - ఎందుకు భయం!

భూముల వ్యవహారంలో సీఐడి కేసు నమోదు చేసినప్పుడు... సీబీఐ కీ కేసును ఇవ్వాలి అనుకున్నప్పుడు రెండుసార్లు పిటిషనర్లు లేదా టిడిపి కార్యకర్తలు నానా యాగీ చేశారు. దీనిపై విచారణకు తదుపరి దర్యాప్తు ముందుకు వెళ్లకుండా కోర్టు అడ్డుకోవాలని పిటిషన్లు వేశారు. సీబీఐ దర్యాప్తునకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కోర్టు అడ్డుకున్న అప్పటికీ సిఐడి కేసులు నమోదు చేసింది. ఇప్పుడు సిఐడి కేసులను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అసలు సీబీఐ దర్యాప్తునకు టిడిపి నాయకులు గానీ కార్యకర్తలు గాని ఎందుకు అడ్డుతగిలారు..? అమరావతి భూముల వ్యవహారంలో ఎలాంటి మోసం జరగనప్పుడు అత్యున్నత కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తునకు ఎందుకు మోకాలొడ్డారు..? అన్నది ప్రధాన ప్రశ్న. భూముల వ్యవహారంలో అంతా నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటే సిబిఐ దర్యాప్తు ని ఆహ్వానించేవారు కదా!! ఇది గుర్తించాల్సిన అంశం.

ఇది గుర్తించాలి!

ఈ తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు సైతం ఉన్న ప్రమేయం మీద పలు ఆరోపణలు వచ్చాయి. దాని మీద ప్రత్యేకమైన విచారణ జరిగినప్పటికీ.. కేసులు నమోదు కాలేదు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హైకోర్టు పూర్తిగా పోలీసు వాదనను పక్కన పెట్టి కేవలం పిటిషనర్ల వాదనను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం మీద ప్రభుత్వం న్యాయ నిపుణుల చేత పరిశీలన చేయిస్తోంది. దీన్ని అత్యున్నత న్యాయస్థానం లోనే ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంటే ఈ భూముల వ్యవహారం ఇక్కడితో అయిపోలేదు టిడిపి కార్యకర్తలు నేతలు అమితామైన ఆనందం పొదల్సింది లేదు... ఇప్పుడే మొదలైంది అసలు ఆట!!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp