అమరావతి డిజైన్ కు జస్ట్ మిలియన్ డాల్లర్లు ఖర్చు పెట్టాం!

By Kiran.G Nov. 28, 2019, 07:44 am IST
అమరావతి డిజైన్ కు జస్ట్ మిలియన్ డాల్లర్లు ఖర్చు పెట్టాం!

అమరావతిలో క్షేత్రస్థాయిలో పనులు ఇంకా మొదలుపెట్టలేదని,డిజైన్లను రూపొందించడానికి మాత్రం మిలియన్ డాలర్లు ఖర్చయిందని సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ కంపెనీలు వైదొలగినా, వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. ఈసారి అమరావతి నిర్మాణానికి పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని విపక్ష సింగపూర్ నేత బ్రాడ్ బోయర్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ ను పరిశీలించిన సింగపూర్ ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను ఖండించింది.

Read Also: సేవ్ వైసీపీ అంటా...!

బ్రాడ్ బోయర్ వ్యాఖ్యలపై తప్పుడు వార్తల నిరోధక చట్టాన్ని తొలిసారి ప్రయోగించింది. సింగపూర్ ఇటీవలే అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలు నిరోధించే, "ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆన్లైన్ ఫాల్స్ హుడ్ అండ్ మానిప్యులేషన్" చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. బోయర్ చేసిన వ్యాఖ్యలు ఈ చట్టపరిధిలోకి వస్తాయని ఆ పోస్ట్ ను తొలగించాలని బోయర్ కి సూచించింది.

సింగపూర్ ప్రభుత్వానికి చెందిన తెమాసెక్ జిసిఐ కంపెనీలు విదేశాల్లో పెట్టే పెట్టుబడిపై ప్రభుత్వ జోక్యంపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ ఈనెల 13 న ఫేస్బుక్ లో బోయర్ ఒక పోస్ట్ పెట్టాడు.అమరావతి ప్రాజెక్టుల్లో సింగపూర్ కంపెనీలు పెట్టుబడి పెట్టిన 4 బిలియన్ డాలర్లు బూడిదలో పోసిన పన్నీరే అయ్యిందని బోయర్ వ్యాఖ్యానించారు. సింగపూర్ ఆర్ధికమంత్రి బోయర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ అమరావతిలో క్షేత్రస్థాయిలో పనులు ఇంకా మొదలుపెట్టలేదని, డిజైన్లను రూపొందించడానికి మాత్రం మిలియన్ డాలర్లు ఖర్చయిందని వివరణ ఇచ్చారు.

బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారన్న అసత్య వార్తను బోయర్ ఉపసంహరించుకోవాలని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. POFM చట్టాన్ని ప్రయోగించినా, బోయర్ తన పోస్టును తొలగించలేదు,కానీ ప్రభుత్వం ఇచ్చిన వివరణను తన పోస్టుకు జత చేసాడు. దీనిపై సింగపూర్,రాజకీయవర్గాల్లో, ప్రజల్లో చర్చ నడుస్తుంది.

Read Also: చంద్రబాబు పర్యటన.. నల్ల జెండా ఎగరేసిన రైతులు.. ఏం జరగనుంది?

గత ఐదేళ్ళలో నెలకోక డిజైన్ చొప్పున విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం చివరికి ఏ డిజైన్ను ఫైనల్ చెయ్యకుండా కాలంగడిపింది. సింగపూర్ కంపినీలు తనను చూసి ఉచితంగా డిజైన్ ఇస్తున్నాయన్న బాబు మాటల్లోని డొల్లతనం బ్రాడ్ బోయర్ ఆరోపణలతో వెల్లడయ్యింది.

రాజధానిని మొత్తం అభివృద్ధిచేసేశాను .నాతొ రండి అభివృద్ధిని చూపిస్తాను అని ఈ రోజు చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళుతున్నాడు. చంద్రబాబు నన్నుచూసి సింగపూర్ కంపెనీ డిజైన్లు ఉచితంగా ఇచ్చింది అని చెప్పుకున్నాడు. కానీ సింగపూరు ప్రతిపక్ష నేత పేస్ బుక్లో పెట్టిన పోస్ట్ మీద సింగపూర్ ప్రభుత్వం స్పందించి,ప్రతి పక్ష నేత చూపినట్లు మిలియన్ డాలర్లు అమరావతిలో ఖర్చు పెట్టలేదు,అసలు పనులే మొదలు కాలేదు,కేవలం ఒక మిలియన్ డాలర్లు మాత్రం డిజైన్ కోసం కంపెనీలు ఖర్చు చేశాయని ప్రకటించింది....

మరి చంద్రబాబు ఈ రోజు పర్యటనలో అభివృద్ధి ఎవరికీ చూపిస్తాడు?ఎప్పటిలాగానే ఆంధ్రజ్యోతికి మాత్రమే బాబు చూపించే అభివృద్ధి కనిపిస్తుందా?

Read Also: తెలుగులో చదివితే బంట్రోతులు మాత్రమే అవుతారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp