చైనా విమానాల లీజులు రద్దు చేయరంట..?

By Voleti Divakar Sep. 18, 2020, 09:00 am IST
చైనా విమానాల లీజులు రద్దు చేయరంట..?

ప్రస్తుతం భారత్-చైనాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. చైనా ఈశాన్యభారత్ లోని సరిహద్దుల్లో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం దురాక్రమణలకు పాల్పడుతూ భారత్ పై కయ్యానికి కాలుదువ్వుతోంది. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ దేశానికి చెందిన మొబైల్ యాప్లను నిషేధించింది. ఈ యాప్ల ద్వారా చైనా భారతదేశ ఆంతర్గత సమాచారాన్ని తస్కరిస్తోందన్నది ప్రభుత్వ వాదన.

ఈనేపథ్యంలో పౌర విమానయాన రంగంలోని చైనా విమానాల లీజులను కూడా రద్దు చేస్తారా? అని వైఎస్సార్ సిపి చీఫ్ విప్ నూర్గాని భరత్ పార్లమెంటులో ప్రశ్నించారు. ఎయిరిండియాతో పాటు, చైనా కంపెనీలకు చెందిన విమానాలు కూడా భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని భరత్ రామ్ పేర్కొన్నారు.

దీనిపై పౌర విమానయానశాఖ ఇన్ చార్జి మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమాధానం ఇస్తూ.. చైనా కంపెనీల విమానాల లీజులు రద్దు చేసే యోచన లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఆ కంపెనీల యాజమాన్యాలన్నీ ఐర్లండ్ లో నమోదై ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. ఏడు చైనా విమాన కంపెనీలతో ఐర్లాండ్ తో ఒప్పందాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. దీంతో కేంద్రం.. భారత్ లో చైనా విమానాల కార్యకలాపాలను రద్దు చేయమని స్పష్టం చేసింది.

కాగా, మార్గాని భరత్ రామ్ ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన వాణిజ్య, రాజకీయ కేంద్రం, సాంస్కృతిక రాజధాని రాజనుహేంద్రవరం వినూనాశ్రయంలో ఆంతర్జాతీయ కార్గో, కొరియర్ సేవలను ప్రారంభించాలని కోరారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp