రన్‌వే పై ప్రమాదం.. రెండు ముక్కలైన బోయింగ్‌ విమానం

By Kotireddy Palukuri Aug. 07, 2020, 09:20 pm IST
రన్‌వే పై ప్రమాదం.. రెండు ముక్కలైన బోయింగ్‌ విమానం

కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయం రన్‌వే పై ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి వచ్చిన బోయింగ్‌ విమానం రన్‌వేపై దిగుతుండగా జారింది. విమానం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో పైలెట్‌ సహా ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 180 మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సిబ్బంది ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

కేరళలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. రన్‌వే పై నీరు నిలిచి ఉండడంతో విమానం జారిందని సమాచారం. ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది. భారీ వర్షాలకు కేరళలో పలు ప్రాంతాలు వరదముంపులో చిక్కుకున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఇడిప్పి జిల్లాలో  కొండ చరియలు విరిగిపడి 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp