వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సిట్ ముందుకు ఆది నారాయణ రెడ్డి

By Amar S Dec. 12, 2019, 10:30 am IST
వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సిట్ ముందుకు ఆది నారాయణ రెడ్డి

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160కింద ఆది నారాయణ రెడ్డికి పోలీసులు నోటీసు ఇచ్చారు. మార్చి 15న పులివెందులలో వివేకా హత్య జరిగితే దాదాపుగా 8నెలల తర్వాత మాజీ మంత్రిని విచారణకు పిలుస్తున్నారు. హత్య జరిగిన రోజే కొందరు వైసీపీ నేతలు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. పదిరోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ ఆదినారాయణరెడ్డి విచారణకు హాజరుకానుండటం చర్చనీయాంశమవుతోంది. ఈనెల 5న ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తప్పుందని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటానని ఇప్పటికే అదినారాయణరెడ్డి వెల్లడించారు. వివేకా కేసు విచారణ సిట్​కు చేతకాకుంటే సీబీఐకి అప్పగించాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్​ చేశారు. మరోవైపు హత్యతో ఆదినారాయణ రెడ్డికి సంబంధం ఉందని వైసీపీ అగ్రనేతలు కూడా ఆరోపించిన నేపధ్యంలో ఇవాళ ఏం జరుగుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp