మరోసారి వార్తలో సోనూసూద్.. కులం కన్నా గుణం గొప్పది..

By Voleti Divakar Aug. 04, 2020, 09:00 pm IST
మరోసారి వార్తలో సోనూసూద్.. కులం కన్నా గుణం గొప్పది..

సాయం చేసేందుకు ముందుండే రీల్ విల‌న్ సోనూసూద్‌ ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా మరో సారి మరోసారి రియ‌ల్ హీరో అయ్యారు. ఓ వితంతువుకు సాయం చేసి మ‌రోసారి మ‌న‌సున్న మ‌నిషిగా నిరూపించుకున్నారు. అస్సాంలోని జ‌ల్‌పైగురిలో వ‌ర‌ద‌ల కార‌ణంగా ఓ మ‌హిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంస‌మైంది. ఆమెకు తోడుగా నిలిచేందుకు భ‌ర్త కూడా లేరు. పిల్ల‌లు తిన‌డానికి కూడా తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. దీంతో దెబ్బ‌తిన్న గుడిసెను వీడియో తీసి దాన్ని సోనాల్ సింఘ్ అనే మ‌హిళ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో కాస్తా సోనూ దృష్టికి వచ్చిన‌ వెంట‌నే ఆమెకు రాఖీ పండుగ‌రోజు వ‌రాన్ని ప్ర‌సాదించారు. చెల్లెమ్మ‌కు కొత్త ఇంటిని కానుక‌గా ఇస్తానంటూ ప్ర‌క‌టించారు. దీంతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో సోనూపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

పోటీపడుతున్న సామాజిక వర్గాలు

'గెలిచిన వాడు అందరి వాడు...ఓడిన వాడు ఒంటరివాడన్నది' నానుడి. ఇప్పుడు సినీనటుడు సోనూసూద్ అందరివాడయ్యాడు. మానవత్వానికి, మంచి తనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి నిజజీవిత హీరోగా మారిన సినీనటుడు సోనూసూద్ ను సొంతం చేసుకునేందుకు అనేక సామాజిక వర్గాలు ఇప్పుడు పోటీపడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది సోనూసూద్ తమ కులముంటే తమ కులమని సామాజిక మాధ్యమాల ద్వారా భుజాలు చరుచుకుంటున్నారు. మతం కన్నా గుణం గొప్పదని ఆయన తన చేతల ద్వారా చాటి చెప్పినా వీరు మాత్రం కుత్సితంగా కులాన్ని పట్టుకుని వేలాడుతున్నారు.

లాక్ డౌన్లో తాము ఆరాధించే సినీ హీరోలు, నటులు ఏం చేస్తున్నారన్న ఆసక్తి ప్రజల్లో రేకెత్తడం సహజం. సామాన్య ప్రజల్లో ఉత్కంఠ లేకుండా హీరోలు, ప్రముఖ దర్శకులు తాము ఇంట్లో ఉండి అంట్లు తోముతున్న, ఇల్లు ఊడుస్తున్న, వంటలు చేస్తున్న, మొక్కలు నాటుతున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి పరస్పరం సవాళ్లు విసురుకుని కరోనా కాలంలో కూడా ప్రజలకు వినోదాన్ని మాత్రమే పంచారు.

ఇతరులు కూడా..

తెరపై విలన్ గా కనిపించే ప్రకాష్ రాజ్ తన ఇంటినే సత్రంగా మార్చి లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు, పేదలకు అండగా నిలిచారు. అలాగే తెలుగు తెరపై విలన్ గా కనిపించే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా కరోనా విలయం సందర్భంగా అక్షయ్ కుమార్ కూడా కరోనా విలయం సందర్భంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీగా విరాళాన్ని అందించడంతో పాటు, కరోనా బాధితులు, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను ఆదుకుంటూ ఆదర్శంగా నిలిచారు.

కులం కాదు.. సోనూసూద్ ఆదర్శం..

పంజాబ్ లోని మోగాకు చెందిన సోనూ సూద్ అయితే లాక్ డౌన్ కాలం నుంచి వలస కూలీలు, పేదలకు అండగా నిలుస్తున్నారు. సేవా కార్యక్రమాలకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని లాక్ డౌన్ సమయంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, పేదలను బస్సులు, రైళ్లు, అవసరమైతే విమానాల ద్వారా కూడా స్వస్థలాలకు పంపారు. ఆతరువాత కూడా వారి బాగోగులు చూస్తున్నారు. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి, వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేస్తున్నారు.

ఎపిలోని పేద కూలీ తన కుమార్తెలను కాడెద్దులుగా మార్చి పొలం దున్నుతున్న సంఘటన పై స్పందించి వెంటనే ఆ రైతుకు ట్రాక్టర్ పంపారు. అలాగే కరోనా కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న హైదరాబాదు చెందిన ఒక యువతి ధీనగాథను గుర్తించి వెంటనే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. తన చేతల ద్వారా మంచి మనసున్న వ్యక్తిగా కొనియాడబడుతున్న సోనూసూద్ రాజకీయ నేతల కంట్లో నలుసుగా మారారు. మరోవైపు ప్రజలంతా తమ కులంవాడే అనుకునే విధంగా పేరుప్రతిష్టలు సంపాదించారు. సోనూసూద్ ను ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఆయన కులాన్ని కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp