చంద్రంగారి పాట అనలేకపోయిన ఏబీఎన్ రాధకృష్ణ

By Krishna Babu Oct. 29, 2020, 06:45 pm IST
చంద్రంగారి పాట అనలేకపోయిన ఏబీఎన్ రాధకృష్ణ

దివంగతనేత వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ "తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని చంద్రబాబుకి ఎంత ఉబలాటంగా ఉందో మనకి తెలియదు కానీ అధ్యక్ష... ఆయనను తిరిగి వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలనే ఉబలాటం మాత్రం ఈనాడు , ఆంధ్రజ్యోతి పత్రికలకు ఉందని, అందుకే రోజూ ప్రభుత్వం పై ఉన్నవీ లేనివి కల్పించి అచ్చువేసి ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు తెప్పించే ప్రయత్నం నిర్విరామంగా చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు.

నాడు వైయస్సార్ చెప్పిన విధంగానే నేటికీ ఈనాడు పత్రిక మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి పెడార్ధాలు తీస్తూ వాటికి కల్పనలు జోడించి, తాము అనుకున్నదే వాస్తవం అన్నట్టు, అదే ప్రజలు కూడా నమ్మితీరాలన్నట్టు వ్యవహరిస్తూ వస్తుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వందల్లో ఇలాంటి వార్తలు అచ్చు వేసినా తాజాగా జగన్ ప్రభుత్వం తన ఇమేజ్ ని పెంచుకునేందుకు బానెట్ కోల్మెన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని ఎక్కడా లేని పద్దతిని జగన్ అనుసరిస్తున్నారని "సర్కారు వారి భజనపాట" అంటూ శీర్షికలు పెట్టి మొదటి పేజీలో అచ్చు వేసింది.

నిజానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రజ్యోతి చెప్పిన విధంగా ఎక్కడా ఎవరు చేయనిదా? జగన్ ఒక్కరే ఇలాంటి నిర్ణయాలు తీసుకునటూన్నారా అని పరిశీలించి చూస్తే ఆంధ్రజ్యోతి అచ్చువేసిన వార్తలో డొల్లతనం బయట పడుతుంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు దేశ స్థాయిలో ప్రాచుర్యం కల్పించుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఇలాంటి ఏజెన్సీలని ఆశ్రయించి వారి ద్వరా సదరు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలను ప్రాచుర్యం కల్పించుకుంటూ ఉంటారు ఇది సహజంగా జరిగే పనే. వాస్తవానికి ఇదే పద్దతిని గత చంద్రబాబు ప్రభుత్వం కూడా అమలు చేసింది

చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో చేస్తున్న పనులని అలాగే తన పార్టీ శాసనసభ్యులు, మంత్రులు చేస్తున్న పనులని ప్రచారం చేసుకుని ప్రజల్లో తమ ప్రతిష్టని పెంచుకోవడం కోసం 25కోట్ల రూపాయలచొప్పున "గ్రూప్ ఎం" సంస్థకు కట్టబెట్టారు. అలాగే తన వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఫేస్ బుక్, ట్విట్టర్ హ్యాండిల్స్ ని నడపటానికి "హుబిలియొ" సంస్థకు ఏడాదికి 6 కోట్లు చొప్పున కట్టబెట్టారు. చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్ పెంచేందుకే మీడియా రంగానికి చెదిన 160 మంది నిపుణులని కాంట్రాక్ట్ బేస్ మీద నియమించున్నారు. ఇక తన ఆస్థాన మీడియాగా పిలవబడే ఇదే ఆంధ్రజ్యోతి మీడియాకు అసెంబ్లీ రైట్స్ మోత్తన్ని నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ధనం కుమ్మరించి కట్టబెట్టారు.

వాస్తవాలు ఇలా ఉంటే జగన్ ప్రభుత్వం ఎక్కడా లేని విధానాన్ని అనుసరిస్తుందని ప్రజలను మభ్యపెట్టేలా కథనం ప్రచురిచటం ఒక్క రాధాకృష్ణకే చెల్లింది. చంద్రబాబు తన ప్రభుత్వంలో ఇటువంటి పనే చెస్తే అందులో స్వయంగా లబ్ది పొందిన రాధా కృష్ణ, నేడు జగన్ ప్రభుత్వం పై ఇలా కథనాలను రాయటం ఏం జర్నలజం విలువలు అని మీడియా రంగంలోని వారే ముక్కున వేలు వేసుకుంటున్నారు.చంద్రబాబు చేస్తే రాధా కృష్ణకి మాహాద్బుతంలా , అదే జగన్ చేస్తే మాహా తప్పుగా కనిపించటం రాధాకృష్ణకు మామూలే అంటూ సాటి జర్నలిస్ట్ మిత్రులే ఆంధ్రజ్యోతిపై సెటైర్లు వేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp