విశాఖ క్రేన్ ప్రమాద బాధితులకు 50 లక్షల నష్టపరిహారం చెల్లింపు

By Kiran.G Aug. 02, 2020, 03:29 pm IST
విశాఖ క్రేన్ ప్రమాద బాధితులకు 50 లక్షల నష్టపరిహారం చెల్లింపు

విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి 50 లక్షల పరిహారంతో పాటు బాధిత కుటుంబాలకు హిందూస్థాన్ కంపెనీలో ఉద్యోగం కూడా కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు హిందూస్థాన్ షిప్ యార్డ్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు కంపెనీ అంగీకరించిందని అవంతి శ్రీనివాస్ తెలిపారు.కొన్ని రోజులుగా విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుందన్న అక్కసుతో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అలా చేయడం తగదని హితవు పలికారు.

ప్రకృతి వైపరీత్యాలకు, దుర్ఘటనలకు ఏ ఒక్కరినీ నిందించలేమని అవంతి తెలిపారు.. హిందూస్థాన్ షిప్ యార్డ్ చరిత్రలో ఇదే మొదటి ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు. కాగా క్రేన్ కూలి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబంలో ఒకరికి వారి అర్హతలను బట్టి పర్మినెంట్ ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగాలను, తాత్కాలిక ఉద్యోగులకు తాత్కాలిక ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలియజేసారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp