కియాలో ఏమి జరుగుతుంది? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ..

By Suresh Sep. 24, 2021, 06:00 pm IST
కియాలో ఏమి జరుగుతుంది? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ..

నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం లోకం చుట్టి వస్తుందనే నానుడికి అతికినట్టుగా సరిపోయే ఘటనలు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో అనేకం చూస్తూ వస్తున్నాం, అందునా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పై అనేకం ప్రతిపక్ష పార్టీ టీడీపీ,మరియూ దాని అనుబంధ మీడియా,సోషల్ మీడియాలు పెట్రేగి ప్రచారం చేస్తూ రావడాన్ని చూస్తున్నాం.అయితే పరిశ్రమల విషయంలో ఇలాంటి అసత్య ప్రచారాలు ఒక్కింత ఎక్కువే జరగతుండటం మనకు తెలిసిన విషయమే.

మొన్నటికి మొన్న అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ తరిలిపోతొంది అనే ప్రచారం టిడిపి మీడియా సంస్థలు అరచి గగ్గోలు పెట్టి అదో జాతీయ అంతర్జాతీయ సమస్యగా చూపడానికి విశ్వప్రయత్నం చేశాయి కానీ ఆ సంస్థ యాజమాన్యం మేమెక్కడికి తరలిపోవడం లేదు అని చెప్పడం ఆ ప్రచారానికి తెరపడింది.

ఇలాగే టీడీపీ హయాంలో తామ రక్తమాంసాలు ధారపోసి నిర్మించినట్టు చెప్పుకునే కియా విషయంలో కూడా అనేక అపప్రచారలు చేస్తూ వస్తోంది, కియా పరిశ్రమ మహా రాష్ట్రకు తరలిపోతోంది అని ఒకసారి, కాదు కాదు తమిళనాడుకు తరలిపోతోంది అని మరోసారి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే, దానికి ఏకంగా ఆ సంస్థ సీఈఓ గారు మేము ఎక్కడికీ తరలిపోవడం లేదు ప్రస్తుత ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం అందుతోంది అని ప్రకటన చేశారు అప్పటికి గానీ సదరు పార్టీ దాని మీడియా సంస్థల నోళ్లకు తాళం పడలేదు.

Also Read : కుప్పంలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం వెనుక ఎవరున్నారు..?

ఈ క్రమంలో మరో దుష్ప్రచారానికి టీడీపీ సోషల్ మీడియా ఒడిగట్టింది అదేమిటంటే ఈ నెల 17 వ తేదీన హ్యుందాయ్ గ్లోవిస్ సంస్థ ఉద్యోగుల మధ్య చిన్న గొడవకు సంభంధించి లేని పోని నాటకీయతను జోడిస్తూ "ఈ ప్రభుత్వానికి పరిశ్రమల ఏర్పాటు చిత్తశుద్ధి ఏటో లేదు కనీసం మా హయాంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలనైనా తరళిపోకుండా చూడాలి, కానీ అలాంటి ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు కనుకనే ఇలా గొడవలు జరుగుతున్నా చోద్యం చూస్తోంది అంటూ" ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేసింది.

కానీ జరిగిన విషయంపై పెనుకొండ సబ్ డివజనల్ పోలీసు అధికారులు విడుదల చేసిన పత్రికా ప్రకటన చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది అది ఇద్దరి కార్మికుల వ్యక్తిగత కారణాలు గొడవకు దారితీసింది, దీనికి సంబందించి స్థానిక పోలీసు స్టేషన్ లో ఆ గొడవకు కారణమైన వ్యక్తులపై కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది, దీంతోపాటు సంస్థ ప్రతినిధులకు కూడా ఇలాంటి ఘటనల పట్ల జాగరూకత గురించి వివరించడం జరిగింది. ఆ సంస్థ కూడా వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని ఉద్యోగాల నుండీ తొలగించడం జరిగిందనే విషయం తెలిసింది.

కానీ టీడీపీ కి చెందిన సోషల్ మీడియా మాత్రం దాడికి సంభదించిన వీడియోను వైరల్ చేస్తూ కియా సంస్థ స్థానిక పరిస్థితులు బాగాలేవు ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థతులే లేవని స్థానిక ఉద్యోగులు, ప్రజలు, పోలీసు అధికారులు చెప్పడం గమనార్హం.

Also Read : ఏపీ రాజకీయాలకు గుడ్ బై : జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp