ఐన్ స్టిన్ సిద్ధాంతాన్ని సవాల్ చేసిన వశిష్ట నారాయణ సింగ్

By Suresh 16-11-2019 07:50 AM
ఐన్ స్టిన్ సిద్ధాంతాన్ని సవాల్ చేసిన వశిష్ట నారాయణ సింగ్

ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు,బీహార్ ఐన్ స్టిన్ గా పేరుగాంచిన వశిష్ఠ నారాయణ్ సింగ్ అనారోగ్యంతో పాట్నాలోని మెడికల్ కాలేజ్ లో గురువారం మరణించారు.బీహార్ లోని బసంత్‌పూర్ లో నివాసం ఉంటున్న అతను చాలా సంవత్సరాలుగా స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతున్నారు.నవంబర్ 14 తారీఖు నాడు గురువారం ఆరోగ్యం క్షిణించడం తో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ వశిష్టనారాయన్ సింగ్ నవంబర్ 15 తారీఖు మధ్యాహ్నం మరణించారు.

ఏప్రిల్ 2, 1942 న జన్మించిన సింగ్, రాంచీకి సమీపంలో ఉన్న నేతర్‌హాట్‌లోని నేతర్‌హాట్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి సింగ్ తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు.ఉన్నత విద్య కొరకు పాట్నా విశ్వవిద్యాలయం Bsc(hons) కోర్సులో చేరినప్పుడే విద్యార్థిగా తన ప్రతిభను నిరూపించుకొని యూనివర్సిటీ ఉత్తమ విద్యార్థి అయ్యాడు.ఆయన బెర్కిలి లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకొని ఉన్నత విద్య పుర్తయిన అనంతరం నాసా లో తన సేవలను అందించారు..,అక్కడ కొన్నాళ్లపాటు వాషింగ్టన్ యూనివర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెస్సర్ గా పనిచేశారు.

స్వదేశానికి తిరిగి వచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై ,ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్త,మండల్ యూనివర్సిటీ పాట్నా లాంటి ప్రఖ్యాత భారతీయ విశ్వవిద్యాలయాల్లో బోధించారు..ఆర్యభట్టియం లోని అత్యంత క్లిష్టమైన గణిత సవాళ్ళను పరిష్కరించారు.. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని సవాల్ చేసి అంతర్జాతీయ గణిత శాస్త్రజ్ఞుల దృష్టిని తన వైపు తిప్పుకున్న నారాయణ్ సింగ్ చివరి దశలో పేదరికంలో అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతూ మరణించారు..మరణించిన్నప్పుడు కూడా ప్రభుత్వం తగు రీతిలో గౌరవించకుండా నిర్లక్ష్యం వహించింది..ఆయనకు జరిగిన అవమానాన్ని ఓఎద్ద ఎత్తున నెటిజన్లు నిరసన వ్యక్తం చేశారు.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దృష్టికి వచ్చిన తర్వాత ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు..

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News