ఉల్లిరాజ్యంలో క‌డ‌ప సంచులు!

By G.R Maharshi Dec. 11, 2019, 06:08 pm IST
ఉల్లిరాజ్యంలో క‌డ‌ప సంచులు!

ఉల్లి ధ‌ర‌లు ఇలాగే ఉంటే మ‌న‌వాళ్లు టీవీ సీరియ‌ల్ ప్లాన్ చేసినా చేస్తారు. దాని పేరు "ఉమ్మ‌డి కుటుంబంలో ఉల్లి".
కూర‌ల్లోకి కోడ‌లు ఉల్లిపాయ‌లు ఎక్కువ వేసింద‌ని, అత్తగారు త‌రిమేస్తారు. ఆ కోడ‌లు క‌ష్ట‌ప‌డి పొలం కొని, ఉల్లిపాయ‌లు సాగుచేసి ఉత్త‌మ ఉల్లి రైతుగా అవార్డు పొంది అత్త అహంకారాన్ని అణుస్తుంది.

ఒక‌వేళ సినిమా తీస్తే ....హీరో అల్ల‌రిచిల్ల‌ర‌గా తిరుగుతూ ఉంటే, తండ్రి ఉల్లిపాయ‌ల క్యూలో చ‌నిపోతాడు. హీరో ప‌రివ‌ర్త‌న చెంది రోడ్డు మీద ఉల్లిపాయ‌లమ్మి, ఉల్లి ఎంఫైర్‌ని క్రియేట్ చేస్తాడు. సినిమా పేరు ఉల్లి డాన్‌.

ప‌రిస్థితి ఇలాగే ఉంటే జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌కు అద‌నంగా ద‌శ‌ర‌త్నం చేరుతుంది- ఉల్లి ఒడి.
మ‌న చేతిలో ఉల్లిపాయల సంచి ఉంటే
-చంద్ర‌బాబు అయితే లాగేసుకుని, హెరిటేజ్‌లో అమ్మేసుకుంటాడు.
-బీజేపీ వాళ్లైతే GST విధించి, హిందుత్వ గురించి బోధిస్తారు.
-క‌మ్యూనిస్టులైతే మ‌న‌ల్ని బూర్జువాల‌ని తిట్టి, దోపిడీ విధానం నశించాల‌ని పాట‌లు పాడి , సంచిని మురికి కాలువ‌లో విసిరేస్తారు.
-నిర్మ‌లాసీతారామ‌న్ ఐతే రాజ‌కీయాల కంపు ఉన్న‌ప్పుడు అద‌నంగా ఉల్లిపాయ‌ల కంపు ఎందుక‌ని క్లాస్ పీకుతారు.
-ప‌వ‌న్‌క‌ల్యాణ్ అయితే ఓపినియ‌న్స్ అనియ‌న్స్ లాంటివ‌ని, జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని చెబుతూనే నోటికొచ్చిన ఓపినియ‌న్స్‌ని చెబుతాడు. ఈలోగా ఆయ‌న అభిమానుల తొక్కిస‌లాట‌లో మ‌న ఉల్లిపాయ‌లు మ‌న‌కి కాకుండా పోతాయి.
-గ‌ద్ద‌రైతే ఉల్లిపాయ‌ల మీద పాట‌లు పాడుతాన‌ని అప్లికేష‌న్ ఇస్తాడు.
-కేసీఆర్ అయితే మొద‌ట ఉల్లిపాయ‌ల సంచిని లాక్కొని పోలీసుల‌తో కొట్టించి , మ‌న‌కి గుండెపోటు వ‌చ్చిన త‌ర్వాత మ‌న ఉల్లిపాయ‌లు మ‌న‌కి ఇచ్చేసి భోజ‌నం కూడా పెట్టిస్తాడు.
-లోకేశ్ అయితే ఉల్లి అని ప‌ల‌క‌డానికి అవ‌స్థ‌లు ప‌డి, తిన‌డ‌మే త‌ప్ప ప‌ల‌క‌డం తెలియ‌ద‌ని చెబుతాడు.
-వ‌ల్ల‌భ‌నేని వంశీ అయితే ఉల్లి....అని నాలుగు బీఫ్‌ సౌండ్స్ చేస్తాడు.
-అమిత్‌షా అయితే ఉల్లిపాయ‌లు లాక్కోవ‌డ‌మే కాకుండా ఐటీ రెయిడ్స్ చేయించి తీహార్ జైల్లో పెట్టిస్తాడు.
-మోడీ మ‌న‌మీద స‌ర్జిక‌ల్ స్ర్టైక్స్ చేయిస్తాడు.
-కేఏ పాల్ ట్రంప్‌కి ఫోన్ చేస్తాడు.
-రాంగోపాల్‌వ‌ర్మ అయితే ఉల్లిరాజ్యంలో క‌డ‌ప సంచులు అని సినిమా తీస్తాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp