ఒరేయ్...గూగుల్ ఫోటో డౌన్లోడ్ చేసి పెయింటింగ్ అంటావేంట్రా?" - TNR

By TNR Oct. 07, 2020, 09:48 pm IST
ఒరేయ్...గూగుల్ ఫోటో డౌన్లోడ్ చేసి పెయింటింగ్ అంటావేంట్రా?" - TNR
ఈ బొమ్మ ఇంకెవరైనా స్నేహితుడు వేసి ఉండి ఉంటే నా నోటి నుండి వచ్చే మొదటి డైలాగ్ ఇదే..
కానీ ఇది లక్ష్మీ భూపాల్ పెయింటింగ్ కాబట్టి ఇంక అనుమానం లేకుండా ధైర్యంగా నమ్మేయాల్సిందే..
మరీ ఇంత రియాలిస్టిక్ గానా?
ఇది పెయింటింగ్ అని వేసిన వ్యక్తి ,వేస్తుంటే చూసిన వ్యక్తి చెప్తే తప్ప గుర్తు పట్టలేనంత సహజంగా ఉంది..
మామూలుగా ఏ పెయింటింగ్ చూసినా ఎక్కడో ఏ మూలో ఇది పెయింటింగ్ అని తెలిసిపోయే అవకాశం ఉంది.
కానీ ఈ బొమ్మలో ఆ అవకాశమే లేదు.
ఇలాంటి పెయింటింగ్స్ వేయడం వలన ఈయనకు ఏమొస్తుందో ఎంతొస్తుందో తెలియదుగానీ నాలాంటి వాళ్లకు మాత్రం కొండంత అనుభూతి వస్తుంది..
మీ రచనలతో మా మనసుని,పెయింటింగ్స్ తో మా నయనాలని ప్రశాంతపరుస్తున్న మీకు నా కృతజ్ఞతలు..
ఒకే చేతికి రాయడం,గీయడం అనే రెండు లక్షణాలుండటం చాలా అరుదైన కలయిక..
అలాంటి అరుదైన కలయికతో ఉన్న బాపు గారి లాంటి గొప్ప చెయ్యిలాగ ఈతరానికి మీ చేయి గుర్తుండిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా...
వండర్ ఫుల్ పెయింటింగ్ లక్ష్మీ భూపాల్ గారు..
ఆల్ ద బెస్ట్...😍 - TNR
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp