అన్నదాత డొక్కా సీతమ్మ

By Suresh 15-11-2019 04:44 PM
అన్నదాత  డొక్కా సీతమ్మ

అన్నదాత డొక్కా సీతమ్మ పేరిట జనసేన ఆధ్వర్యంలో 'డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు'ప్రారంభించింది. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ గురించి తెలుసుకోవాలి.

సీతమ్మ గారు గొప్ప దానబుద్ధి జీవి, మానవతావాది.. ఆకలి అంటూ ఎవరు ఏ వేళలో వెళ్లినా ముఖం మీద చెరగని చిరునవ్వుతో కొసరి కొసరి వడ్డించి ఆకలి తీర్చేవారు. అడిగినా లేదు.. అందుకే ఆమెకు ఆ ప్రాంతంలో మంచి పేరుంది..డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలుకా మండపేటలో 1841 అక్టోబరులో అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గారికి జన్మించారు. తండ్రి శంకరం గారిని గ్రామస్థులు 'బువ్వన్న' గారని ముద్దు పేరుతో పిలుస్తుండేవారు.పాత రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశం లేకపోవడంతో సీతమ్మకు చిన్నతనం నుంచి తల్లిదండ్రులు కథలు, గాథలు, పాటలు, పద్యాలు నేర్పించారు.ఆమె పెద్దబాలశిక్ష వరకు మాత్రమే పూర్తి చేశారు.చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో..ఇంటి బాధ్యతలు ఆమెపై పడ్డాయి.

గోదావరి పరీవాహక ప్రాంతంలోని లంకల గన్నవరంలో డొక్కా జోగన్న పంతులు అనే ధనవంతుడు ఉండేవారు. ఆయన ధనిక రైతు, వేదపండితుడు. ఓ రోజు జోగన్న పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చారు.. మిట్ట మధ్యాహ్నం బాగా ఆకలయ్యింది.అప్పుడే జోగన్నకు భవానీ శంకరం గుర్తుకొచ్చారట. నేరుగా ఆ ఇంటికి వెళ్లి.. అక్కడే భోజనం చేశారు. సీతమ్మ కూడా ఆదరాభిమానాలు చూపించడంతో.ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నారట. తన మనసులో మాటను సీతమ్మ తండ్రికి చెప్పగా ఆయన అంగీకరించడంతో వారి వివాహం జరిగింది.

లంకల గన్నవరం గోదావరి మార్గ మధ్యలో ఉండటంతో అక్కడ భోజనవసతి ఉండేది కాదు. ప్రయాణికుల ఆకలి తీర్చుకోవటానికో దానశీలిగా పేరుగన్న సీతమ్మ ఇంటికి వెళ్లేవారు. సీతమ్మ-జోగన్న దంపతులు వారి ఆకలి తీర్చేవారు. ఎవరు ఏ సమయంలో వచ్చి లేదనకుండా ఆదరించి అన్నం పెట్టేవారు. లంగ గ్రామాల్లో తరచు వచ్చే అతివృష్టి, అనావృష్టిలతో ఇబ్బందులు పడే ఆ గ్రామాల పేదలను ఆదుకున్నారు...ఓసారి ఆమె అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వెళుతుండగా.. గోదావరి వంతెన దగ్గర బోయీలు పల్లకి ఆపారు. పి.గన్నవరం వైపు వెళుతున్న ప్రయాణికుల్లో కొంతమంది పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే.పెద్దవాళ్లు సర్థిచెప్పారు. గన్నవరం వెళ్లీపోతాం అక్కడ సీతమ్మ గారు అన్నం పెడతారన్నారట. ఆ మాట విన్న సీతమ్మ వెంటనే అంతర్వేది ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి.. వాళ్ళకి అన్నం పెట్టాలని వెళ్ళిపోయారట.

సీతమ్మ గొప్పతనం గురించి తెలుసుకున్న ఏడవ ఎడ్వర్డ్‌ తన పట్టాభిషేక వార్షికోత్సవానికి రావాలని ఆమెకు ఆహ్వానం పంపారు. సముద్రప్రయాణం చెయ్యటం ఇష్టంలేని సీతమ్మ ఎడ్వర్డ్‌ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.దాంతో నర్సాపురం మెజిస్ట్రేట్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ఆవిడను ప్రయాణనైకి ఒప్పించే ప్రయత్నం చేశారు .ఆవిడ అంగీకరించకపోవడంతో చివరకి ఆమె ఫొటో తీసుకొని లండన్‌ పంపారు. సీతమ్మకి కేటాయించిన కుర్చీలో ఆమె చిత్రాన్ని పెట్టి సభ సాగించారు. ఆ బ్రిటిష్ చక్రవర్తి ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఆవిడ వారసుల వద్ద ఉన్నది. సీతమ్మ జీవిత చరిత్రను 1959లో శ్రీ మిర్తిపాటి సీతారామాంజనేయులు విరతాన్నధాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ పేరిట గ్రంధం రాశారు .

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News